కోహ్లీ విజయాలకు కారణం అతనే!: డేవిడ్ వార్నర్
- కోహ్లీని తీర్చిదిద్దిన ఘనత ధోనీదే
- ఓటమి ఎదురైనప్పుడే కెప్టన్ కు సవాల్ మొదలవుతుంది
- ఇంకా మూడు మ్యాచ్ లు ఉన్నాయి
- గెలుస్తామన్న విశ్వాసం ఉంది
మ్యాచ్ లు గెలుస్తున్నంత సేపు చాలా బాగుంటుందని... పరాజయాలు పొందుతున్నప్పుడే కెప్టెన్ కు అసలైన సవాల్ ప్రారంభమవుతుందని వార్నర్ అన్నాడు. తమకు ఇంకా మూడు వన్డేలు ఉన్నాయని...వాటిని గెలవగలమనే విశ్వాసం తమకు ఉందని చెప్పాడు. రెండో వన్డేలో భారత్ ను 252 పరుగులకు కట్టడి చేయగలిగినా... ఓటమిపాలు కావడం తమను నిరాశ పరిచిందని అన్నాడు.