సినిమాల మధ్య గ్యాప్ తగ్గిస్తున్న రజనీకాంత్!

రజనీకాంత్ కి దేశ విదేశాల్లో అభిమానులు వున్నారు. ఆయన నుంచి ఏడాదికి ఒక సినిమా వచ్చినా వాళ్లు ఆనందంతో పొంగిపోతారు. అలాంటి రజనీకాంత్ నుంచి వచ్చే ఏడాది రెండు సినిమాలు రానున్నాయి .. అదీ చాలా తక్కువ గ్యాప్ లో కావడం విశేషం. రజనీ కథానాయకుడిగా శంకర్ తెరకెక్కించిన '2.0' సినిమా, జనవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 ఆ తరువాత మూడు నెలల గ్యాప్ లోనే 'కాలా' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే 'కాలా' సినిమా 70 శాతం వరకూ షూటింగును పూర్తిచేసుకుంది. మిగతా 30 శాతం షూటింగును నవంబర్ చివరివారం నాటికి పూర్తి చేయనున్నారు. రంజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, ఏప్రిల్ లో విడుదల చేయనున్నారు. ఇలా రజనీ సినిమాలు వెంటవెంటనే రావడం ఆయన ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి. 
Go Back to Shorts
rajani

More Telugu News