అన్నయ్య సలహాతోనే వచ్చాను .. కానీ సక్సెస్ కాలేకపోయాను : నాగబాబు
Add ap7am to your home Screen

అన్నయ్య సలహాతోనే వచ్చాను .. కానీ సక్సెస్ కాలేకపోయాను : నాగబాబు

 సినీరంగం వైపుకు తాను రావడానికి దారితీసిన పరిస్థితులను గురించి తాజా ఇంటర్వ్యూలో నాగబాబు ప్రస్తావించారు. మొదటి నుంచి కూడా తనకి సినిమా రంగం వైపుకు రావాలని ఉండేది కాదనీ, అన్నయ్య చిరంజీవి సలహాతోనే వచ్చానని చెప్పారు. ఒక వైపున నిర్మాతగా కొనసాగుతూనే అడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేశానని .. అది కూడా సన్నిహితులు ఒత్తిడి చేయడం వల్లనేనని అన్నారు.

నిర్మాతగా చాలాకాలం కొనసాగిన తరువాత గానీ, తనకి ఆ ప్రొఫెషన్ సెట్ కాదనే విషయం అర్థమైందని చెప్పారు. ఓ నిర్మాతగా వున్న తనకి చిరంజీవి .. పవన్ కల్యాణ్ .. చరణ్ సినిమాలు చేసిపెట్టారని అన్నారు. అల్లు అరవింద్ సపోర్ట్ కూడా తనకి ఉండేదని చెప్పారు. అయినా తాను నిర్మాతగా సక్సెస్ కాలేకపోయాననీ, తనలో నిజమైన ప్రొడ్యూసర్ లేకపోవడం అందుకు కారణం కావొచ్చని చెప్పుకొచ్చారు.   
nagababu

More Telugu News