మణిరత్నం మూవీలో కీలకమైన పాత్రలో జ్యోతిక!
Add ap7am to your home Screen

మణిరత్నం మూవీలో కీలకమైన పాత్రలో జ్యోతిక!

సూర్య సపోర్ట్ తో జ్యోతిక కొంతకాలం క్రితమే సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఆమె కీలకమైన పాత్రలను చేస్తూ వస్తోంది. సూర్య నిర్మించిన ఓ సినిమా ద్వారా త్వరలో ఆమె ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం ఆమె బాల దర్శకత్వంలో 'నాచ్చియార్' అనే సినిమా చేస్తోంది. ఇందులో జీవీ ప్రకాశ్ కుమార్ ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు.

 ఈ నేపథ్యంలో జ్యోతిక మరో సినిమాను కూడా అంగీకరించినట్టు సమాచారం. అది మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కావడం విశేషం. మణిరత్నం నెక్స్ట్ మూవీలో ఒక కీలకమైన పాత్ర ఆమెను వెతుక్కుంటూ వచ్చిందట. దాంతో ఎంత మాత్రం ఆలోచించకుండా ఆమె ఓకే చెప్పేసినట్టు సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.     
jyothika

More Telugu News