జయలలిత 'వేదనిలయం' వెనుక ఇంత పెద్ద మిస్టరీ ఉందా?... అందుకే ఆ ఇంటి కోసం శశికళ, దీప పోటీ పడుతున్నారా?

22-08-2017 Tue 13:27 | National
చెన్నై, పోయెస్ గార్డెన్ లోని వేద నిలయంపై ఆసక్తికర వార్త ఒకటి తమిళనాట చక్కర్లు కొడుతోంది. మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవితకాలం గడిపిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం తమకు చెందాలంటే తమకు చెందాలని ఆమె నెచ్చెలి శశికళ, మేనకోడలు దీపాజయకుమార్, మేనల్లుడు దీపక్ పావులు కదుపుతున్నారు. జయలలితకు చెందిన ఆస్తి ఆమె వారసులకు చెందుతుందనుకుంటే, దీపక్, దీపలకు వెళుతుంది. అలా కాకుండా దానిని జయలలిత స్మారక నిలయంగా మార్చేందుకు తమిళనాడు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ నేపథ్యంలో దానిని జాతీయం చేయాలనుకుంటోంది.

అయితే, జయలలిత ఇంటిపై ప్రేమతో వారంతా ఆ ఇల్లు కావాలనుకోవడం లేదని తమిళనాడులో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వేదనిలయంలోని ఒక గది కోసమే ఈ పోరాటమని పుకార్లు షికారు చేస్తున్నాయి. జయలలిత తన జీవితకాలంలో సంపాదించిన సొత్తు మొత్తాన్ని ఒక రహస్య గదిలో దాచి ఉంచారని, ఆ గది తెరవడం అంత సులభం కాదని తెలుస్తోంది. ఆ గదికి సంబంధించిన బయోమెట్రిక్ కీ జయలలిత దగ్గరే ఉందని, తన కాలి ముద్రలతో మాత్రమే ఆ సీక్రెట్ డోర్ ను తెరవగలరని చెప్పుకుంటున్నారు. అందువల్లే ఆమె అంతిమయాత్ర సందర్భంగా ఆమె భౌతికకాయాన్ని దగ్గర్నుంచి చూసిన వాళ్లు, ఆమెకు కాళ్లు లేకపోవడాన్ని గుర్తించారని, ఆ మధ్య మీడియాలో కూడా కథనాలు వెలువడ్డాయని చెప్పుకుంటున్నారు.

తట్టు వ్యాధి కారణంగా కాళ్లు తొలగించాల్సి వచ్చిందని డాక్టర్ల నుంచి క్లారిటీ వచ్చినా, సీక్రెట్ రూం, బయోమెట్రిక్ కీ వంటి అనుమానాలు అలాగే ఉండిపోయాయి. అదే సమయంలో జైలు శిక్ష విధించిన రోజు రాత్రి శశికళ వేదనిలయంలో బస చేశారు. ఇది కూడా పలు అనుమానాలను బలపరుస్తోందని తమిళులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ, సీక్రెట్ గదిలో సొత్తు ఉందా? లేక తరలించేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలింతకీ ఈ సీక్రెట్ గది నిజమా? కల్పనా? అన్నదానిపై పలువురు వివరణ ఇస్తూ, కొడనాడు ఎస్టేట్ లో ఆస్తుల కొసమే దొంగతనం జరిగిందని, అందులోనే ఆస్తులు ఉండగా, జయలలిత అధికారిక నివాసంలో ఉండవా? అని లాజిక్కు తీస్తున్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more