అత్యంత ఖరీదైన ఎన్నిక ఇదే... నంద్యాలలో దొరికింది కోటిన్నర, పంచింది 60 కోట్లు!

22-08-2017 Tue 09:59 | Both States
తెలుగుదేశం పార్టీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి, వైఎస్ఆర్ సీపీ తరఫున శిల్పా మోహన్ రెడ్డి ప్రధానంగా పోటీ పడుతున్న నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఓటర్లకు భారీ ఎత్తున నగదు పంపిణీ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల బందోబస్తులో భాగంగా పోలీసులు జరిపిన తనిఖీల్లో దాదాపు కోటిన్నర రూపాయలు పట్టుబడగా, సుమారు 60 కోట్ల రూపాయలు ప్రజలకు అందినట్టు సమాచారం. ఓ పార్టీ ఓటుకు రూ. 2 వేలు పంచగా, మరో పార్టీ రూ. 1000 ఇచ్చినట్టు ప్రజలు చెప్పుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం ఓ గ్రామంలో తొలుత ఓ ప్రధాన పార్టీ రూ. 1000 చొప్పున పంచగా, అదే రోజు సాయంత్రం మరో పార్టీ వచ్చి ఓటుకు రూ. 2 వేల చొప్పున పంపకాలు ప్రారంభించగా, తొలుత వెయ్యి రూపాయలు ఇచ్చిన పార్టీ వచ్చి మరో వెయ్యి చొప్పున ఇచ్చి వెళ్లినట్టు తెలుస్తోంది. రెండు పార్టీలూ వేసిన ఎత్తుకు పైఎత్తులు ఎలా ఉన్నా, చివరకు పంపకాల్లో ఒక పార్టీ ముందడుగు వేసినట్టు ప్రచారం జరుగుతూ ఉంది.

అభివృద్ధి పేరిట తొలుత ప్రచారం జరిగినప్పటికీ, చివరకు వచ్చేసరికి రెండు ప్రధాన పార్టీలు డబ్బు మూటలను రంగంలోకి దించాయి. కొన్ని ప్రాంతాల్లో ఓటుకు రూ. 5 వేల వరకూ ధర పలకగా, పలు చోట్ల తమకు డబ్బు అందలేదన్న నిరసనలూ బహిర్గతమయ్యాయి. ఇక గ్రామాల వారీగా ప్రధాన పార్టీలు స్వయంగా నియమించుకున్న బయటి వ్యక్తులు మాత్రమే పంపకాలను పర్యవేక్షించారు. స్థానిక కార్యకర్తలు ఓటర్ల ఇంటిని చూపించడానికి పరిమితం కాగా, ఇంట్లోని ఓట్ల సంఖ్యను బట్టి డబ్బులను బయటి వ్యక్తులే అందించినట్టు సమాచారం. ఇక నంద్యాలలోని కొన్ని వార్డుల్లో స్థానిక నాయకులే డబ్బులను జేబులో వేసుకున్నారని కొంతమంది మహిళలు పెద్దపెట్టున నినాదాలు చేయగా, అప్పటికప్పుడు డబ్బులు తెచ్చి వారికి పంచినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఖరీదైన అసెంబ్లీ ఎన్నికలుగా నిలిచాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more