నోరు జారిన అంజలి... హల్ చల్ చేస్తున్న రూమర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నోరు జారిన అంజలి... హల్ చల్ చేస్తున్న రూమర్!

తెలుగు తెరపై అడపా దడపా మాత్రమే కనిపిస్తోన్న అంజలి, తమిళ సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో అక్కడ ఆమె చేసిన 'బెలూన్' సినిమా, త్వరలో విడుదలకి ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో అంజలి రాజకీయాల్లోకి రానుందనే వార్త తమిళనాట షికారు చేస్తోంది.

రజనీకాంత్ పార్టీ పెడితే అందులో అంజలి చేరే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. తాజాగా 'బెలూన్' మూవీ ప్రమోషన్లో అంజలి మాట్లాడుతూ, తనకి రాజకీయాలంటే చాలా ఆసక్తి ఉందని చెప్పింది. రాజకీయ పరిణామాలను చాలా దగ్గరగా గమనిస్తూ ఫాలో అవుతుంటానని అంది. అంతే .. అప్పటి నుంచి ఆమె రాజకీయాల్లోకి రానుందనే ప్రచారం మొదలైంది. ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదని ఆ తరువాత ఆమె చెప్పినా .. ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు.      
anjali

More Telugu News