పబ్లిక్ టాక్: లుక్ పరంగా .. ఫెర్ఫార్మెన్స్ పరంగా నితిన్ అదరగొట్టేశాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పబ్లిక్ టాక్: లుక్ పరంగా .. ఫెర్ఫార్మెన్స్ పరంగా నితిన్ అదరగొట్టేశాడు!

నితిన్ తాజా చిత్రంగా ఈ రోజున 'లై' భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నితిన్ - మేఘా ఆకాశ్ జంటగా నటించగా విలన్ పాత్రలో అర్జున్ నటించాడు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు .. ఇది రొటీన్ సినిమాలకి భిన్నంగా ఉందని అంటున్నారు. లుక్ పరంగా .. ఫెర్ఫార్మెన్స్ పరంగా నితిన్ అదరగొట్టేశాడని చెబుతున్నారు.

ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో నితిన్ తన కెరియర్లోనే బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ చూపించాడని అంటున్నారు. కథానాయిక మేఘా ఆకాశ్ .. నితిన్ కాంబినేషన్లో వచ్చే రొమాంటిక్ సీన్స్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు. ఇక విలన్ గా అర్జున్ అద్భుతమైన నటనను కనబరిచాడనీ .. ఆయనతో నితిన్ తలపడే సీన్స్ హైలైట్ గా వున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  
nithin
megha akash

More Telugu News