నమ్మకం పోకూడదనే ఇలా చేశా!: బోయపాటి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నమ్మకం పోకూడదనే ఇలా చేశా!: బోయపాటి

బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన 'జయ జానకి నాయక' ఈ రోజున భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న హీరోతో పెద్ద బడ్జెట్ లో ఈ సినిమాను తెరకెక్కించిన సాహసం బోయపాటి సొంతం. అలాంటి ఈ సినిమాను క్రేజ్ వున్న రెండు సినిమాలతో పోటీ పడుతూ రంగంలోకి దిగడం కూడా ఆయన సాహసమే.

అయితే ఈ విషయంలో తాను పంతానికి పోలేదని బోయపాటి అన్నారు. ముందుగా ఈ సినిమాను జూన్ 23వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నామనీ .. ఆ తరువాత జూలై 7వ తేదీన విడుదల చేద్దామనుకున్నామని చెప్పారు. ఆ రెండు తేదీల్లోను కొన్ని కారణాల వలన రాలేకపోయామని అన్నారు. ఇప్పుడు కూడా రిలీజ్ డేట్ వాయిదా వేసుకుంటే తనపై బయ్యర్లకి నమ్మకం పోతుందని చెప్పారు. బడ్జెట్ ను .. వసూళ్లను దృష్టిలో పెట్టుకుని రాక తప్పలేదని చెప్పుకొచ్చారు.
boyapati

More Telugu News