ఛార్మి ఎంట్రీతో డ్రగ్స్ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో?

22-07-2017 Sat 07:19 | Entertainment
హైదరాబాదులో డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు సినీ పరిశ్రమలోని ప్రముఖులను చాలా పకడ్బందీగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణ కోసం సిట్ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఏ టీం వారిని ప్రశ్నిస్తుందో బయటకు ఏమాత్రం పొక్కనీయకుండా చర్యలు తీసుకుంటున్నారు. తొలి రోజు సిట్ కార్యాలయానికి దర్జాగా వచ్చిన పూరీకి సిట్ అధికారుల ప్రశ్నలు, చూపిన సాక్ష్యాలు దిమ్మదిరిగేలా చేశాయి. ఆ విచారణ వివరాలు తెలుసుకుని రెండో రోజు విచారణకు పక్కాప్లాన్డ్ గా వచ్చిన శ్యామ్ కే నాయుడును ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీరు  తాగించి, నిజాలు కక్కించారు సిట్ అధికారులు.

ఇక మూడోరోజు మరింత ప్రణాళిక ప్రకారం ఏమీ చెప్పకుండా మొండికేసిన సుబ్బరాజుకు వీడియోలు, ఫోటోలు, ఇతర సాక్ష్యాలు చూపించి, బ్యాంకాక్ నుంచి డ్రగ్స్ తెచ్చి పూరీకి ఇచ్చానని స్వయంగా చెప్పేలా చేశారు. ఇక పూరీ బ్యాచ్ లో కీలకమైన వ్యక్తి సినీ నటి చార్మీ. ఆమె విచారణకు వచ్చిన తరువాత ఈ కేసులో ఎన్నో ట్విస్టులు వెలుగు చూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పూరీ జగన్నాథ్ తో ఛార్మీకి బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని టాలీవుడ్ లో చాలాకాలంగా గుసగుసలు వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో పూరీ డ్రగ్స్ తీసుకున్నారనేందుకు, అతనికి శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు పూర్తిగా సహకరించారని, డ్రగ్ పెడ్లర్లుగా వ్యవహరించారనేందుకు పూర్తి సాక్ష్యాధారాలను సిట్ సంపాదించింది.

ఈ నేపథ్యంలో పూరీ సంస్థలో ఉద్యోగిగా, వ్యాపార భాగస్వామిగా, క్లోజ్ ఫ్రెండ్ అయిన ఛార్మీ ఎంట్రీ అనంతరం ఈ కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగు చూసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే పూరీ, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు విచారణ వివరాలు, సిట్ అధికారుల తీరుతెన్నులు, వేస్తున్న ప్రశ్నల గురించిన పూర్తి వివరాలు తెలుసుకుని, ఛార్మీ పూర్తి సన్నద్ధంగా విచారణకు హాజరయ్యే అవకాశం ఉండడంతో అధికారులు మరింత పకడ్బందీ వ్యూహాలు రచించాల్సిన అవసరం ఉందని అంతా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఛార్మీ విచారణపై సర్వత్రా ఆసక్తి రేగుతోంది. 

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more