పవన్ కి 'తొలిప్రేమ'... బన్నీకి 'ఆర్య'.. వరుణ్ కి 'ఫిదా'!
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ .. యువ కథానాయకులు ప్రేమకథా చిత్రాలు చేయవలసిన ఆవశ్యకతను గురించి చెప్పారు. పవన్ కల్యాణ్ కి 'తొలిప్రేమ' .. బన్నీకి 'ఆర్య' వంటి ప్రేమకథలు పడ్డాయనీ, అవి వాళ్ల కెరియర్ కి ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. వరుణ్ చేసిన 'ఫిదా' సినిమా ఆ తరహాలోనిదేననీ, ఈ సినిమా ఆయన కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు.