‘సాహో’లో నటించే అవకాశం పోగొట్టుకున్న అనుష్క.. అధిక బరువే కారణం?

10-07-2017 Mon 15:44 | Entertainment
‘బాహుబలి’ జంట ప్రభాస్, అనుష్క మరోమారు జోడీ కట్టనున్నారని, ‘సాహో’లో కలిసి నటిస్తున్నారనే వార్తలు ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఓవర్ వెయిట్ కారణంగా అనుష్కకు ఆ సినిమాలో నటించే అవకాశం దక్కలేదని తెలుస్తోంది. ‘బాలీవుడ్ లైఫ్’ కథనం ప్రకారం, అనుష్క తన బరువును తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఇంకా ఐదు నుంచి ఎనిమిది కిలోల బరువు తగ్గాల్సి ఉందట. దీంతో, ‘సాహో’లో నటించే అవకాశం అనుష్క కోల్పోయిందని సమాచారం.

కాగా, ‘సాహో’ను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో దర్శకుడు సుజిత్ రూపొందిస్తున్నారు. 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ సరసన మొదట కత్రినాకైఫ్ నటిస్తుందని అనుకున్నారు. అయితే, కత్రినా అంగీకరించలేదు. దీంతో, మరోనటి శ్రద్ధాకపూర్ కు అవకాశం దక్కింది. కానీ, ఆమె అధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాత అందుకు అంగీకరించలేదు. దీంతో, ఆ అవకాశం అనుష్కను వరించింది. కానీ, ఓవర్ వెయిట్ కారణంగా ఆ అవకాశాన్ని స్వీటీ పోగొట్టుకోవాల్సి వచ్చింది. కాగా, గతంలో విడుదలైన ‘సైజ్ జీరో’ చిత్రం కోసం అనుష్క బరువు పెరిగింది. అయితే, ఆ చిత్రం తర్వాత సాధారణ బరువుకు వచ్చేందుకు ఆమె ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం కనపడడం లేదట! 

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more