రజనీకాంత్ లా ఉన్నాడనే అతన్ని పెళ్లాడిందట!

06-07-2017 Thu 22:07 | Entertainment
కొద్దోగొప్పో పోలికలతో.. మనిషిని పోలిన మనుషులు కనబడుతూనే ఉంటారు. ఓ సెలెబ్రిటీ పోలికలు ఓ సాధారణ వ్యక్తికి ఉంటే..ఆశ్చర్యమనిపించడమే కాదు, ఆ వ్యక్తిని తేరిపారా చూడాలనే ఆసక్తి నెలకొంటుంది. అలా రాజకీయనాయకులు, సినీ తారలు, ఇతర ప్రముఖుల పోలికలున్న వ్యక్తులు తారసపడుతూనే ఉంటారు. ముఖ్యంగా, సినీ తారల పోలికలతో ఉన్న వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే, మరింత ఆశ్చర్యం కలగకమానదు. తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ ను పోలిన సోమసుందర్ అనే వ్యక్తి గురించి ముఖ్యంగా ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే, దిండిగల్ కు చెందిన ఆయనను స్థానికులు కూడా రజనీ సోము అనే పిలుస్తుంటారు.

రజనీ అంటే ఆయనకు చెప్పలేనంత పిచ్చి. సోము జీవితంలో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. సోము తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఆస్తిని అమ్మేసి రజనీకాంత్ సినిమాని ప్రమోట్ చేశాడట! ఈ విషయం తెలిసిన ఆయన కుటుంబ సభ్యులు సోముకు బడితే పూజ చేశారు. సోము తన అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జన్మనిచ్చింది తల్లిదండ్రులే అయినా తన జీవితం మాత్రం రజనీ చుట్టూనే తిరుగుతుందని, ఆయన తన జీవితమని చెప్పాడు. తాను రజనీకాంత్ లా కనిపించేందుకు, ప్రత్యేకంగా ఓ టైలర్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నానని, తనకు బట్టతల లేకపోయినా రజనీ హెయిర్‌స్టైల్ కోసం రెండు వైపులా సగం మేర జుట్టు మొలవకుండా తొలగించేశానని చెప్పాడు. రజనీ కాంత్ లా కనిపించేందుకు తాను చేయని ప్రయత్నం లేదని చెప్పాడు.

రజనీ కాంత్ సినిమాలు విడుదలైనప్పుడు అభిమానులు హడావుడి చేస్తుంటారు. కానీ, సోము రజనీ వీరాభిమాని కనుక, ఆయన స్టైలే వేరు. రజనీ తన సినిమాలో గిరగిరా తిప్పుకుంటూ సిగిరెట్ తాగితే.. సోము కూడా అదేమాదిరిగా స్మోకింగ్ చేశాడు. రజనీ కాంత్ డ్రింక్ తాగితే ఆయన కూడా తాగేస్తాడు. ‘అమ్మను గౌరవించు’ అని మన్నన్ సినిమాలో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ కు పరవశించి పోయిన సోము తన పద్ధతి మార్చుకున్నానని పేర్కొన్నాడు. ఓ సినిమాలో రజనీకాంత్ ఆటోడ్రైవర్ వేషం వేస్తున్నాడని తెలిసి.. తాను ఆటో డ్రైవింగ్‌ నేర్చుకుని, రజనీ స్టైల్ లో కొంతకాలం ఆటోనడిపానని ఇరవై ఐదేళ్ల నుంచి రజనీని అనుసరిస్తున్న సోము చెప్పాడు.

 మరో ఆసక్తి కరమైన విషయమేమిటంటే.. ‘ఆయన అచ్చం రజనీకాంత్‌లా ఉన్నారనే నేను పెళ్లి చేసుకున్నాను. ప్రతి ఇంట్లోనూ దేవుడు ఉంటాడు. అయితే మా దేవుడు రజనీయే’ అని సోము భార్య చెప్పడం విశేషం. సోముకు ఓ సారి ఎదురైన చేదు అనుభవం గురించి ప్రస్తావిస్తూ, ‘ఓ సారి తమిళనాడు ఎన్నికలు వచ్చాయి. ‘జయలలితకు ఓటేస్తే దేవుడు కూడా తమిళనాడును కాపాడలేడు ’ అని రజనీ పిలుపు నిచ్చారు. దీంతో ఆమె ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అదే సమయంలో చెన్నై వెళ్లిన నన్ను నిజంగానే రజినీకాంత్ అనుకుని ఓ తాగుబోతు బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. నా మూలంగానే జయలలిత ఓడిపోయిందంటూ పిచ్చకొట్టుడు కొట్టాడు’ అని చెప్పుకొచ్చాడు.

రజనీకాంత్ కోసం ఆయన అభిమానులు దేనికైనా సిద్ధంగా ఉన్నారని చెబుతున్న సోము, యాంకరింగ్, స్టేజి షోలు చేయడమే కాదు, టీవీ సీరియళ్లలోనూ చిన్న పాత్రలు పోషించాడు. కాగా, రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. రజనీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే కనుక ఆయన వెన్నంటి ఉండే సోమసుందరం లాంటి అభిమానులకు ఏమాత్రం కొదవలేదనే చెప్పవచ్చు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more