కల్యాణ్‌గారి భార్య ‘ఆనా’... నేను కాదు!: పవన్ కల్యాణ్ అభిమానులకు రేణూ దేశాయ్ విజ్ఞప్తి!

01-07-2017 Sat 06:46 | Entertainment
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులనుద్దేశించి ఆయన మాజీ భార్య, సినీనటి, నిర్మాత రేణూదేశాయ్ సోషల్ మీడియా ఫేస్ బుక్ వేదికగా సుదీర్ఘమైన లేఖ రాసింది. ఈ లేఖలో వివరణతోపాటు విజ్ఞప్తి కూడా చేసింది. "నాలుగేళ్లుగా ఫేస్‌ బుక్, ట్విటర్‌ లాంటి సోషల్‌ మీడియాలో నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి వరుసగా అభ్యర్థనలు, విన్నపాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. నేను నా ఇంటర్వ్యూల్లో, సోషల్‌ మీడియాలో ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ఇవి ఆగడం లేదు. అందుకే మరోసారి చాలా స్పష్టంగా నా అభిప్రాయాన్ని చెప్పడానికి క్రింది పోస్ట్‌ పెడుతున్నాను....

మిత్రులకు, నా శ్రేయోభిలాషులందరికీ నమస్కారం. మీరు నిరంతరం నా పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, నాకు అందిస్తున్న సహాయ సహకారాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కల్యాణ్‌ గారు నాలుగు సంవత్సరాల క్రితం ‘ఆనా’ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక చక్కటి కూతురు కూడా ఉంది. ఆయన వివాహ బంధాన్ని, ఆయన కుమార్తెకు జన్మనిచ్చిన తల్లిని గౌరవిస్తూ... నేను మీకు చేసుకునే విన్నపం ఒక్కటే. నేను, కల్యాణ్‌గారు తిరిగి ఏకం కావాలని మీరు పదేపదే కోరుకోవద్దు.

దయచేసి మీరు ఒక విషయం అర్థం చేసుకుని ఆమోదించాలి. అదేంటంటే, కల్యాణ్‌గారికి భార్య ‘ఆనా’... నేను కాదు....ఒకటి మాత్రం నిజం. ఆయన నా పిల్లలకు తండ్రి. నేనూ, ఆయన మంచి స్నేహితులం మాత్రమే. కానీ మేమెప్పటికీ తిరిగి భార్యాభర్తలం కాలేము. ఈ సత్యాన్ని నేను మనసా, వాచా, కర్మణా అంగీకరిస్తున్నాను. మీరు కూడా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నన్ను తిరిగి కల్యాణ్‌ గారి దగ్గరకు వెళ్లమని మాటిమాటికీ మీరు కోరడం సబబు కాదని గుర్తించాల్సిందిగా మనవి చేస్తున్నాను.

మరో వైవాహిక బంధంలో ఉన్న ఆయన దగ్గరకు తిరిగి వెళ్లడం అసమంజసం, అసాధ్యం, అర్థరహితం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. భవిష్యత్‌ లో ఈ విషయమై ఎలాంటి ఇబ్బందులు కలిగించే ఒత్తిడితో కూడిన కోరికలేవీ మీ వద్ద నుంచి ఎదురు కావని ఆశిస్తున్నాను. ఎంతో నిజాయతీగా, మనస్ఫూర్తిగా మీకు నేను చేసిన ఈ విన్నపాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని, ఎప్పటిలా మీ నిర్మలమైన స్నేహ వాత్సల్యాలను అందిస్తారని కోరుకుంటూ.. నమస్కారం" అంటూ ఒక సుదీర్ఘమైన లేఖను అభిమానులకు రేణు రాసింది.

ఈ లేఖకు మంచి ఆదరణ లభిస్తోంది. ‘మీరెంతైనా మా అన్న వైఫ్‌ కాబట్టి, మీ ఇద్దరూ కలవాలని కోరుకుంటాం. మిమ్మల్ని ఎప్పటికీ మా ‘వదిన’లానే భావిస్తాం’ అంటూ పలువురు అభిమానులు వ్యాఖ్యానించారు. మరికొందరు ‘మీ పోస్ట్‌ లో మీ బాధ తెలుస్తోంది’ అని పేర్కొన్నారు. ఇంకొందరు మాత్రం ‘మీ నిర్ణయాన్ని గౌరవిస్తాం’ అని తెలిపారు. 

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more