వైసీపీ నేతలు ఎటు తిప్పయినా మాట్లాడగలరు: టీడీపీ ఎమ్మెల్యే అనిత మండిపాటు

29-06-2017 Thu 19:47 | Both States
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే అనిత మరోమారు మండిపడ్డారు. ఇమేజ్ పెంచుకోవడం కోసమే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పై ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలగపూడిలో అనిత మీడియాతో మాట్లాడారు. విశాఖ భూకుంభకోణం విషయమై టీడీపీ మంత్రులపై రోజా చేసిన వ్యాఖ్యలపై ఆమెను ప్రశ్నించగా.. ‘కత్తికి రెండు వైపులా పదును అన్నట్టుగా, వైఎస్సార్సీపీ నేతలు ఎటుతిప్పి అయినా మాట్లాడగలరని చెప్పడానికి వారి మాటలే నిదర్శనం. మొన్నటికి మొన్న ఈ కుంభకోణంపై దర్యాప్తు జరపాలని వారు కోరారు. ఈ కుంభకోణంపై విచారణకు సిట్ ఏర్పాటు చేసిన తర్వాత సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. మంత్రి గంటా గారు స్వయంగా సీబీఐ విచారణకు సిద్దమని చెప్పిన తర్వాత, గంటా-అయ్యన్న మధ్య సయోధ్య కుదిరిందని రోజా అంటున్నారు. వారి మధ్య సయోధ్య కుదిరిందని అంత కచ్చితంగా చెబుతున్న రోజా, ఆ సయోధ్య తనే కుదిర్చిందేమో!

అసలు వైజాగ్ ఇమేజ్ పై వైసీపీ నేతలు ఎందుకంత అసూయ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇండియాలోనే మంచి స్మార్ట్ సిటీ అయిన వైజాగ్ పై బురద జల్లడాన్ని ఉపేక్షించకూడదు. ఈ రోజు లక్షల ఎకరాలు ట్యాంపరింగ్ అయ్యాయని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. మరి, భూములు కోల్పోయిన వారెవ్వరూ ఎందుకు ముందుకు రావడం లేదు? బాధితుల్లో కనీసం ఇద్దరిని లేదా ముగ్గురిని సిట్ ముందుకు వైఎస్సార్సీపీ ఎందుకు తీసుకురాలేకపోతోంది? ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏదో బురదచల్లాలనే ఉద్దేశంతో కాకుండా బాధ్యతగా, ఆధారాలతో సిట్ ముందుకు రావాలి...

రోజా సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయారు. రోజా తన ఇమేజ్ పెరుగుతుందని చెప్పి చంద్రబాబు, లోకేశ్ పై ఆరోపణలు చేస్తున్నారు. దీనివల్ల రోజా ఇమేజ్ రోజురోజుకీ పడిపోతోందనే విషయం ఆమెకు అర్థం కావట్లేదు. నోబెల్ ప్రైజ్ ఎవరైనా సాధిస్తే మేము ఇంత ఆఫర్ చేస్తామని గతంలో చెప్పామనే విషయాన్ని చంద్రబాబుగారు మాట్లాడితే.. నోబెల్ ప్రైజ్ ఇచ్చేందుకు చంద్రబాబు ఎవరంటూ వైఎస్సార్పీపీ నేతలు మాట్లాడుతున్నారు! అసలు, వాళ్లు మాట్లాడే మాటలకు పొంతనే లేదు’ అని అనిత మండిపడ్డారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more