ఆ మాయ‌లేడి బెడ్ రూం నిండా కెమెరాలే... ఏకంగా 25 మంది ఎంపీలను మోసం చేసింది!

04-05-2017 Thu 16:19 | National
త‌న‌ను ఓ మహిళ బెదిరిస్తోందంటూ ఇటీవ‌ల గుజరాత్ బీజేపీ ఎంపీ కేసీ పటేల్ చేసిన ఫిర్యాదు క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. అయితే, ఆ మాయ‌లేడిపై విచార‌ణ చేప‌ట్టిన పోలీసులకు విస్మ‌యం క‌ల‌గ‌జేసే నిజాలు తెలిశాయి. ఆ మహిళ  మొదట వయసు పైబడిన ఎంపీల వివ‌రాలు సేక‌రిస్తోందని, ఆ త‌రువాత మోసాల‌కు పాల్ప‌డుతుంద‌ని పోలీసులు గుర్తించారు. ఆ మాయ‌లేడీ ఐఏఎస్‌ చదివి కలెక్టర్‌ కావాలనుకుందని, అయితే, అందుకు త‌గ్గ కృషి చేయ‌క‌పోవ‌డంతో ఆమె ఐఏఎస్ కాలేక‌పోయింద‌ని పోలీసులు తెలిపారు.

అనంత‌రం ఆమె రాజ‌స్థాన్ ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నం చేసింద‌ని, ఆ క‌ల కూడా నెర‌వేర‌లేద‌ని చెప్పారు. ఇక‌, ఆమె ఎంపీల‌ను మోసం చేసి డబ్బు సంపాదించాల‌ని నిర్ణ‌యించుకుని మోసాల‌కు పాల్ప‌డింద‌ని వివ‌రించారు. వ‌య‌సులో పెద్ద వారైన ఎంపీల ఫోన్ నంబ‌ర్లను సేక‌రించి, వారికి పోన్ చేసి క‌మ్మ‌గా మాట్లాడుతుంద‌ని చెప్పారు. అనంత‌రం ఆ ఎంపీల‌ను త‌న ఇంటికి ర‌మ్మ‌ని పిలుస్తుంద‌ని, ముందుగానే త‌న బెడ్ రూంలో కెమెరాల‌ను సెట్ చేసుకుని ఉంటుంద‌ని తెలిపారు. ఆమె చెప్పిన‌ మాట‌లు న‌మ్మి ఆమె ఇంటికి వ‌చ్చిన ఎంపీకి మ‌త్తు మందు ఇస్తుంద‌ని, అనంత‌రం ఎంపీతో అస‌భ్య‌క‌ర రీతిలో ఫొటోలు, వీడియోలు తీసి డ‌బ్బులు డిమాండ్ చేస్తోంద‌ని పోలీసులు గుర్తించారు.

ఈ క్ర‌మంలో ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు 25 మంది ఎంపీల‌ను మోసం చేసి, ఇటీవ‌లే గుజరాత్ ఎంపీని మాయ చేసి, ఆయనతో అసభ్యకర పొజిషన్లలో ఫొటోలు దిగి రూ.5 కోట్లు డిమాండ్ చేసింద‌ని వివ‌రించారు. ఆ మ‌హిళ బెడ్ రూం నిండా కెమెరాలు ఉంటాయ‌ని, అంతేగాక ఆమె వ‌ద్ద స్పై కెమెరాలు కూడా ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more