ప్రియాంక చోప్రా పార్టీ ఇస్తే వెళ్లిన మీకు... వినోద్ ఖన్నా అంత్యక్రియలకు రావడానికి తీరిక లేదా?: రిషికపూర్ ఫైర్

28-04-2017 Fri 12:03 | Entertainment
ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా అనారోగ్యంతో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. నిన్న ముంబైలో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, రణదీర్‌ కపూర్‌, జాకీష్రాఫ్‌, అర్జున్ రాంపాల్‌, కబీర్‌ బేడి తదితరులు హాజరు కాగా, ప్రస్తుత స్టార్ లు, వర్థమాన నటులు హాజరుకాలేదు. దీనిపై సీనియర్ నటుడు రిషి కపూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, రిషికపూర్ కూడా హాజరు కాలేదు. దీనిపై ఆయన స్పందిస్తూ, కుటుంబ సభ్యులతో కలసి తాను విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయానని చెప్పారు.

 అయితే ‘ఈ తరానికి చెందిన ఒక్క నటుడు కూడా వినోద్‌ ఖన్నా అంత్యక్రియలకు హాజరుకాకపోవడం అవమానకరమని ఆయన మండిపడ్డారు. ఆయనతో కలిసి నటించినవారు కూడా ఆయన అంత్యక్రియలకు రాకపోవడం దారుణమని ఆయన తెలిపారు. ముందు పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని ఆయన సినీ నటులకు హితవు పలికారు. భవిష్యత్ లో తాను మరణించినా, తన శవాన్ని మోస్తారన్న గ్యారెంటీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ తరం సోకాల్డ్ స్టార్స్‌ పై తనకు చాలా కోపం వస్తోందని ఆయన తెలిపారు. ఈ మధ్య తాజాగా హాలీవుడ్ కి వెళ్లిపోయిన ప్రియాంక చోప్రా ఇచ్చిన పార్టీకి ఈ తరం చెమ్చా గ్యాంగ్‌ మొత్తం వెళ్లారని ఆయన ఎద్దేవా చేశారు. వినోద్ ఖన్నా అంత్యక్రియలకు మాత్రం హాజరయ్యేందుకు వారికి తీరిక లేకుండా పోయిందని ఆయన ధ్వజమెత్తారు. 

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more