భర్త మృతి వార్తనే బ్రేకింగ్‌ న్యూస్‌ గా చదివిన న్యూస్ రీడర్!

08-04-2017 Sat 21:17 | National
మీడియాలో పని చేసేవారు భావావేశాలకు లోనుకాకుండా విధులు నిర్వర్తిస్తుంటారు. పలు సందర్భాల్లో వ్యక్తిగత ఆలోచనలను, వ్యక్తిగత స్పందనలను మర్చిపోయి విధులు నిర్వర్తిస్తుంటారు. అలాంటి ఘటనే ఛత్తీస్ గఢ్ లో చోటుచేసుకుంది. ఈ వివరాల్లోకి వెళ్తే... సుప్రీత్‌ కౌర్‌ (28) గత తొమ్మిదేళ్లుగా ఛత్తీస్‌ గఢ్‌ లోని ఓ ప్రముఖ వార్తా ఛానెల్‌ లో న్యూస్‌ రీడ‌ర్‌ గా పనిచేస్తున్నారు. ఆమెకు హర్సద్‌ కవాడే అనే వ్యక్తితో గతేడాది వివాహమైంది. వీరిద్దరూ రాయ్‌ పూర్‌ లోనే నివాసం ఉంటున్నారు. ఈ ఉదయం విధులకు హాజరైన ఆమె రిపోర్టర్ ఇచ్చిన సమాచారం ప్రకారం పితార ప్రాంతంలో ఓ రెనాల్ట్‌ డస్టర్‌ కారు ప్రమాదానికి గురైందని, అందులో ఐదుగురు ప్రయాణిస్తుండగా ముగ్గురు మృత్యువాతపడ్డారని హెడ్ లైన్స్ లో చదివారు. ఆ కారు తన భర్తదేనని, ఆ కారును నడుపుతున్న వ్యక్తి కూడా తన భర్తేనని, ఆయన మరణించారని ఆమెకు అప్పుడే అర్థమైంది.

అయినప్పటికీ వృత్తి ధర్మాన్ని విస్మరించని ఆమె మనోనిబ్బరంతో బాధను దిగమింగి బులెటెన్‌ ముగించి ఇంటికి వెళ్లారు. అప్పటికే డెస్క్ లో ఈ వార్త తెలుసుకున్న సిబ్బంది విషణ్ణవదనులైపోయారు. దీనిపై వారు స్పందిస్తూ... ‘మహసముండ్‌ జిల్లాలోని పితారా వద్ద రెనో డస్టర్‌ వాహనం ఈ ఉదయం ఘోర ప్రమాదానికి గురైందని, వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు మృత్యువాత పడినట్టు డెస్క్ వార్తను ఇవ్వగానే, ఆ కారు తన భర్తదేనని ఆమె గుర్తించారని, అయితే బులెటిన్ మధ్యలో అక్కడి నుంచి వెళ్లిపోకుండా న్యూస్‌ బులెటిన్‌ పూర్తి చేసి వెళ్లారని, ఆమెతో క‌లిసి ప‌నిచేస్తునందుకు తామంతా గ‌ర్వ‌ప‌డుతున్నామని, ఆమె జీవితంలో జరిగిన ఈ దుర్ఘటన తమల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయిన వారంతా దేవుడు ఆమెకు మనోనిబ్బరాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు.


More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more