గుజరాత్‌పై నైట్‌రైడర్స్ రికార్డు విజయం.. లయన్స్ బౌలర్లను ఊచకోత కోసిన లిన్!

08-04-2017 Sat 08:16 | Sports
గుజరాత్ సొంతగడ్డ రాజ్‌కోట్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ చిత్తుగా ఓడింది. 184 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్‌రైడర్స్ 14.5 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా రికార్డు విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. సురేశ్ రైనా (51 బంతుల్లో 7 ఫోర్లతో 68 నాటౌట్), దినేశ్ కార్తీక్ (25 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 47), బ్రెండన్ మెక్ కలమ్ (24 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 35) మెరుపులు మెరిపించారు. భారీ స్కోరు సాధించినా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో గుజరాత్‌కు ఓటమి తప్పలేదు.

184 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నైట్‌రైడర్స్ ఏ దశలోనూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. గుజరాత్ బౌలర్లను నైట్‌రైడర్స్ ఓపెనర్లు లిన్, గంభీర్‌లు ఊచకోత కోశారు. దొరికిన బంతులను దొరికినట్టు బౌండరీలకు తరలించారు. అనుకోకుండా ఓపెనర్ అవతారమెత్తిన లిన్ (41 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 93) హద్దుల్లేనట్టు చెలరేగిపోయాడు. మ్యాచ్ ముగిసేసరికి అంచనాల్లేని ఈ ఆటగాడు హీరోగా మారిపోయాడు. మరోవైపు నైట్‌రైడర్స్  కెప్టెన్ గౌతమ్ గంభీర్ (48 బంతుల్లో 12 ఫోర్లతో 76) బ్యాట్ ఝళిపించడంతో 14.5 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే భారీ విజయం సొంతమైంది. తృటిలో శతకం చేజార్చుకున్న లిన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more