యోగి సర్కారుకు హైకోర్టు అక్షింతలు.. ఆహార విక్రయం జీవించే హక్కులో భాగమని వ్యాఖ్య

06-04-2017 Thu 07:28 | National
ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కారుకు హైకోర్టు ధర్మాసనం అక్షింతలు వేసింది. ఆహారపు అలవాట్లు, ఆహార విక్రయం అనేవి జీవించే హక్కులో భాగమని, అక్రమ కబేళాలపై చర్యల పేరుతో ఆ హక్కుకు భంగం కలిగించేలా వ్యవహరించరాదని పేర్కొంది. అక్రమ కబేళాలపై కొరడా ఝళిపిస్తున్న యోగి సర్కారు మాంసం విక్రేతల లైసెన్సులను కూడా పునరుద్ధరించడం లేదు. దీంతో సయీద్ అనే మాంసం వ్యాపారి అలహాబాద్ హైకోర్టు  లఖ్‌నవ్‌ బెంచ్‌ ను ఆశ్రయించారు. తన లైసెన్స్ గత నెల 31తో ముగిసిందని, దానిని పునరుద్ధరించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

కేసును విచారిస్తున్న జస్టిస్‌ అమరేశ్వర్‌ ప్రతాప్‌ సాహి, జస్టిస్‌ సంజయ్‌ హర్కౌలీలతో కూడిన ధర్మాసనం.. ఏ ఆదేశాల ప్రకారం అక్రమ కబేళాలు, మాంసం విక్రయాలపై చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని గత నెల 28న ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, ఆరోగ్యంగా ఉండడానికి ఉపకరించే ఆహారాన్ని తప్పు ఎంపికగా భావించకూడదని ఏప్రిల్ 3న జరిగిన విచారణలో హైకోర్టు పేర్కొంది. అక్రమ కబేళాలపై నిషేధం పేరుతో దానిని అడ్డుకోకూడదని స్పష్టం చేసింది. అయితే మాంసం వినియోగాన్ని నిషేధించడం, జంతు వధశాలలను మూసివేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, అక్రమ కబేళాలను మూసివేయడం, కబేళాల పనితీరును క్రమబద్ధీకరించడమే ప్రభుత్వ ఉద్దేశమని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా సయీద్ పిటిషన్‌తోపాటు అదే అంశంపై దాఖలైన పిటిషన్ల విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more