ఒక్క రూపాయికే రెడ్ మి నోట్ 4... ఎలా పొందవచ్చంటే!

05-04-2017 Wed 09:07 | Business
చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షియోమి మరో ఆకర్షణీయ ఆఫర్ ను తీసుకువచ్చింది. ఒక్క రూపాయికే రెడ్ మి నోట్ 4ను కొనుగోలు చేసే అవకాశాన్ని రేపు నిర్వహించనున్న 'ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్'లో దగ్గర చేయనున్నట్టు పేర్కొంది. స్మార్ట్ ఫోన్లలో తమ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఆపై రిజిస్టర్ చేసుకున్న కస్టమర్లందరూ ఈ ఆఫర్ లో పాల్గొనవచ్చని తెలిపింది. ఎంఐ డాట్ కామ్ వెబ్ సైట్ లో జరిగే సేల్స్ లో భాగంగా ఉదయం 10 గంటలకు రెడ్ మి నోట్ 4 స్మార్ట్ ఫోన్లను, మధ్యాహ్నం 2 గంటలకు ఎంఐ బ్యాండ్ 2లు, 10000 ఎంఎహెచ్ పవర్ బ్యాంకులను అందుబాటులో ఉంచుతామని సంస్థ తెలిపింది. తమ ఫ్లాష్ సేల్ లో భాగంగా తొలుత రిజిస్టర్ చేసుకున్న కస్టమర్లు ఎవరైనా వీటిని పొందవచ్చని వెల్లడించింది. అయితే, రెడ్ మి స్మార్ట్ ఫోన్లు 20, ఎంఐ బ్యాండ్ 2లు 40, 10000 ఎంఎహెచ్ పవర్ బ్యాంకులు 50 మేరకు మాత్రమే ఒక్క రూపాయి డీల్స్ కింద విక్రయించనున్నామని షియోమి తెలిపింది. ఇక ఫ్యాన్ ఫెస్టివల్ లో భాగంగా పలు రకాల  ప్రొడక్టులపై రూ. 500 వరకూ తగ్గింపును ఇస్తున్నామని, స్టాక్స్ ముగిసేవరకూ విక్రయాలు సాగిస్తామని వివరించింది.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more