పదవులు కాదు, పార్టీ మనుగడ ముఖ్యం: ఎమ్మెల్యే యరపతినేని

02-04-2017 Sun 19:48 | Both States
పదవులు కాదు, పార్టీ మనుగడ ముఖ్యం అని టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రి వర్గంలో తనకు చోటు దక్కలేదని తానేమీ బాధపడట్లేదని, మంత్రి వర్గ విస్తరణపై వైఎస్సార్సీపీ నేతలవి అర్థరహిత ఆరోపణలని అన్నారు. చంద్రబాబు కృషి, పట్టుదలతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని, దేశంలో క్రమశిక్షణ కలిగిన నాయకుడు చంద్రబాబు అని ఆయన ప్రశంసించారు.

కులాలు, ప్రాంతాలను సమతుల్యం చేస్తూ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగిందని, రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు పదవులు ఆశిస్తారని, ఆ పదవులు దక్కకపోతే విచారం వ్యక్తం చేయడం సర్వసాధారణమన్నారు. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు పార్టీ పెట్టకపోతే తమ లాంటి వారు ఎక్కడ ఉండేవాళ్లోనని, పదవులు రాని వారు పార్టీని ఇబ్బంది పెట్టే పనులు చేయొద్దని యరపతినేని హితవు పలికారు. నలభై ఏళ్లుగా రాని నిధులు చంద్రబాబు దయతో ఇప్పుడు వచ్చాయని, అవగాహన లేని ప్రతిపక్ష నేత జగన్ తన ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. కాగా, మంత్రి పదవి రాకపోయినప్పటికీ యరపతినేని ఎంతో హుందాగా ప్రవర్తించారంటూ సీఎం చంద్రబాబు ఆయన్ని ప్రశంసించడం విదితమే.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more