పార్టీ చేసుకున్న ఇద్దరు యువతులు అనుమానాస్పద స్థితిలో మృతి

01-04-2017 Sat 11:16 | National
ఎంతో ఉత్సాహంగా పార్టీ చేసుకున్న ఇద్ద‌రు యువ‌తులు అనంత‌రం అనుమానాస్పద స్థితిలో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో మరణించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఆ యువ‌తుల మ‌ర‌ణానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీస్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని వసంత విహార్ ప్రాంతంలో ఆ ఇద్ద‌రమ్మాయిలు ఓ ఇంట్లో  పార్టీకి వెళ్లారని, అయితే, అనంత‌రం వారి ఆరోగ్యం బాగా దెబ్బ తింద‌ని తెలిపారు. వారిద్ద‌రి పేర్లు క్లారా, రకీమ్ అని పేర్కొన్నారు. వీరు డ్రగ్స్ అధిక మోతాదులో తీసుకోవం వల్లే మృతి చెంది ఉండ‌వ‌చ్చ‌ని తాము అనుమానిస్తున్నట్లు తెలిపారు. వారిరువురికీ డ్రగ్స్ అలవాటు ఉన్నట్లు త‌మ‌తో వారి స్నేహితులు చెప్పారని  పోలీసులు అన్నారు. ఈ ఇద్ద‌రు అమ్మాయిలకు గత కొన్నేళ్లుగా పరిచయం ఉందని, క్లారా కొన్నాళ్లు తన మరో స్నేహితురాలు జెన్నీతో ఉండి, తర్వాత బంధువులతో కలిసి ఓ ఫ్లాట్‌లో ఉంటోందని పోలీసులు చెప్పారు.

తాము రాత్రి 11 గంటల వరకు పార్టీ చేసుకున్నామని జెన్నీ, ఆ త‌రువాత తాను వెళ్లిపోయాన‌ని, అయితే క్లారా, రకీమ్ ఇద్దరూ తాగుతూ పార్టీ చేసుకున్న త‌మ ఇంటి ద‌గ్గ‌రే ఉన్నార‌ని తెలిపింది. తెల్లవారుజామున 6 గంటలకు తాను తిరిగొచ్చే స‌రికి గది లోపలి నుంచి గడియ పెట్టి ఉందని చెప్పింది. తాము కిటికీ తెరిచి లోపలకు వెళ్లామ‌ని అయితే, ఆ ఇద్దరూ నేల మీద పడి ఉన్నారని చెప్పింది. వెంట‌నే వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించినా లాభం లేకుండా పోయింద‌ని చెప్పింది.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more