'ఇదిగో నాగమణి’ అంటూ భక్తులను నమ్మించే ప్రయత్నం.. పూజారి అరెస్టు!

31-03-2017 Fri 18:01 | National
ప్రజల నమ్మకాలను రకరకాలుగా దోచుకునే మనుషులు మనకు నిత్యం కనిపిస్తూ వుంటారు. అలాగే ఓ పూజారి కూడా ప్రజలను మోసం చేయాలని చూసి అడ్డంగా బుక్కయ్యాడు. ‘నాగమణి’ దొరికిందంటూ భక్తులను నమ్మించే ప్రయత్నం చేసిన ఓ పూజారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని చిక్ బళ్లాపూర్ కి సమీపంలోని గుడిబండిలో ఉన్న చౌడేశ్వరి మాతా ఆలయంలో ఈ సంఘటన జరిగింది. ‘నాగమణి’ని చూపిస్తానంటూ దర్శనానికి వచ్చిన భక్తులను పూజారి ప్రశాంత్ నమ్మించాడు. ఇందులో భాగంగా ఓ నాగుపామును తీసుకువచ్చి ఆలయంలో ఉంచాడు. దేవతా విగ్రహాలు ఉన్న ఒక వెడల్పాటి పళ్లెంలో తెల్లగా మెరుస్తూ ఒకటి కనపడేటట్టు చేసి, అదే ‘నాగమణి’గా భక్తులను నమ్మించాడు.

దీంతో నాగదేవత తమను దీవించడానికి వచ్చిందంటూ భక్తులు తండోపతండాలుగా ఆ ఆలయానికి వెళ్లారు. అయితే, పూజారి తీరుపై అనుమానం వచ్చిన కొందరు భక్తులు స్థానిక తహసీల్దారు, అటవీ శాఖాధికారులు సహా పోలీస్ స్టేషన్ కు సమాచారం అందజేశారు. దీంతో, పూజారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ పళ్లెంలో ఆ వెలుగు ఎలా వచ్చిందనే విషయమై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది టార్చిలైట్ వెలుగని చాలామంది భక్తులు చెబుతుండటం గమనార్హం.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more