ద్విచక్ర వాహనాలపై బంపర్ ఆఫర్లు ప్రకటించిన కంపెనీలు.. నేడు ఆఖరు!

31-03-2017 Fri 08:27 | National
బీఎస్-3 వాహనాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఆటోమొబైల్ తయారీ కంపెనీలు తమ వద్ద ఉన్న ద్విచక్ర వాహనాలను వదిలించుకునేందుకు భారీ రాయితీలు ప్రకటించాయి. బీఎస్-3 కాలుష్య ప్రమాణాలు కలిగి ఉన్న వాహనాలను ఏప్రిల్ 1 నుంచి నిషేధిస్తూ సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. వాటిని విక్రయించడం కానీ, రిజిస్ట్రేషన్ కానీ కుదరదని తేల్చి చెప్పింది. దీంతో కంపెనీలు ఇప్పటికే తమ వద్ద ఉన్న బీఎస్-3 వాహనాలను విక్రయించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా భారీ ఆఫర్లు ప్రకటించాయి. అయితే గడువుకు మరొక్క రోజు మిగిలి ఉండడంతో ఆఫర్ ఈ ఒక్కరోజుకే పరిమితం కానుంది.

తొలుత ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలు హీరో మోటో కార్ప్, హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) డిస్కౌంట్లు ప్రకటించాయి. దీంతో మిగిలిన కంపెనీలు కూడా అదే బాట పట్టాయి. హీరో మోటో కార్ప్ స్కూటర్లపై రూ.12,500, ప్రీమియం బైక్‌లపై రూ.7,500, ప్రారంభ స్థాయి మోడళ్లపై రూ.5,000 తగ్గింపును ప్రకటించగా హెచ్‌ఎంఎస్‌ఐ అన్ని వాహనాలపై రూ.10 వేల డిస్కౌంట్ ప్రకటించింది.

సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం 8 లక్షల వాహనాలపై పడగా వీటిలో 6.71 లక్షల ద్విచక్ర వాహనాలే ఉండడం గమనార్హం. ఒక్క హీరో మోటో కార్ప్‌ కంపెనీ పరిధిలోనే 2 లక్షల వాహనాలు ఉండగా, టాటా మోటార్స్ వద్ద 30 వేలు ఉన్నట్టు అంచనా. ఇక కంపెనీ ప్రకటించిన రాయితీలతోపాటు డీలర్లు సైతం ఆఫర్లు ఇస్తున్నారు. డిస్కౌంట్లు  ప్రకటించడంతో అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని డీలర్లు చెబుతున్నారు.  హైదరాబాద్‌లో ఒక్కో డీలర్‌ వద్ద 200–300 వరకు ద్విచక్ర వాహనాలు ఉన్నట్టు తెలుస్తోంది.  దీంతో ఒక్క రోజులోనే వాటిని విక్రయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కస్టమర్లకు ఫోన్లు చేసి మరీ ఆఫర్ల గురించి చెబుతున్నారు.  

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more