ఏపీలో ఐటీ శకం ప్రారంభం.. రాష్ట్రానికి హెచ్‌‌సీఎల్.. రూ.500 కోట్లతో ఐటీ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు

31-03-2017 Fri 07:20 | Andhra
ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ రూ.500 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ కేంద్రం ద్వారా 5 వేల మందికి ఉపాధి కల్పనతోపాటు మరో 5 వేల మందికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు, హెచ్‌సీఎల్ అధినేత శివనాడర్ సమక్షంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్, నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈవో సిసోడియా,  హెచ్‌సీఎల్‌ ఆర్‌అండ్‌డీ విభాగం వైస్‌ చైర్మన్‌ జీహెచ్‌రావు ఒప్పందాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ హెచ్‌సీఎల్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలు రాష్ట్రానికి రావడంతో నవ్యాంధ్రలో ఐటీ శకం ప్రారంభమైందన్నారు. తిరుమల వెంకన్న దర్శనానికి ఆరు నెలలకు ఓమారు రాష్ట్రానికి వచ్చే శివనాడర్ ఇకపై తన సంస్థ బాగోగులు చూసుకునేందుకు మూడు నెలలకోమారు రావాల్సి ఉంటుందంటూ చమత్కరించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 980 ఐటీ కంపెనీలు ఉన్నాయని, వాటిలో పదిశాతం కంపెనీలను రాష్ట్రానికి రప్పించగలిగితే రాష్ట్ర యువతకు 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని శివనాడర్ పేర్కొన్నారు. అలా చేయగలిగితే మైక్రోసాఫ్ట్ కూడా వస్తుందన్నారు. ఉద్యోగాలు చేసేందుకు గృహిణులు ముందుకొస్తే వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. చంద్రబాబు భరోసాతోనే విజయవాడలో తమ సంస్థ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు శివనాడర్ పేర్కొన్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more