నువ్వేమో గుళ్ల తెర్వుకి పోతావుంటావు... ఆయనకేమో గర్వం!: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఆగ్రహం

29-03-2017 Wed 15:48 | Telangana
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కొమురవెల్లి మల్లన్న గుడిలో మూలవిరాట్ విగ్రహం మట్టిది ఉందని, దానిని తొలగించి, గ్రానైట్ మూలవిరాట్ విగ్రహం పెడతానని ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడుతానని ఆయన గతంలో పేర్కొన్నారు. దీనిపై తనను కలిసిన ముత్తిరెడ్డిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘నీకు సంబంధం లేని విషయాల జోలికెందుకు పోతున్నవు? ఎవడన్నా.. గుళ్లతెర్వుకి పోతరా..! అసలు నీకు ఏం తెలుసని పోతున్నవు..? చేయడానికి పనులే లేనట్లు గుళ్ల ఎంబడి ఎందుకు పడుతున్నవు? నన్ను చూడు.. యాదగిరిగుట్టను అభివృద్ధి చేయాలనుకున్నా. మొత్తం చిన జీయర్‌ స్వామికి అప్పగించిన. ఖతమైపోయింది. ఆయనే అన్నీ చూసుకుంటుండు. మనం గుళ్ల తెర్వుకు పోవుడెందుకు!?’’ అని మండిపడ్డారు. అంతే కాకుండా ‘ఏం మనిషివయ్యా నువ్వు.. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? అసలు గుళ్ల తెర్వుకెందుకు పోతున్నవయ్యా.. ఓ పేపర్ లో పెద్ద పెద్ద అక్షరాలతో నీ ముచ్చటే వచ్చె.. ప్రభుత్వానికి, పార్టీకి బద్‌ నాం కాదా?’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంథని నియోకవర్గ ఎమ్మెల్యే పుట్టా మధు గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పుట్ట మధు కూడా తన దగ్గరికి ఎవరైనా వెళ్తే కసురుకుంటున్నాడు. నీ దగ్గరికి వచ్చినోళ్లందరికీ పని చేస్తవా.. చెయ్యవా అన్నది కాదు.. మంచిగ మాట్లాడితే ఏంబోతది? ఎమ్మెల్యేకాంగనే గర్వం, కోపం వస్తే ఎట్లా? అందుకే పుట్ట మధుకు నియోజకవర్గంలో మైనస్‌ అవుతోంది’’ అంటూ ఆయన మండిపడ్డారు. మీరు వ్యక్తిగతంగా ఎలా ఉన్నా పర్లేదు కానీ, నియోజకవర్గాల్లో మీ వ్యవహార శైలి పార్టీకి నష్టం కలిగించకూడదు కదా? అయన ముత్తిరెడ్డికి సూచించారు. 

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more