టాలీవుడ్ నటుడికి నైజీరియన్ల టోకరా.. కొంపముంచిన ఫేస్‌బుక్ పరిచయం!

29-03-2017 Wed 08:03 | Telangana
ఫేస్‌బుక్ పరిచయం ఓ టాలీవుడ్ నటుడి కొంపముంచింది. నిండా మునిగిన ఆయన చివరికి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన సినీ నటుడికి ఫేస్‌బుక్ ద్వారా ఫిలిసికా ఇస్సాక్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా ముదరడంతో ఇద్దరూ కలిసి తన సినిమాలపై వాట్సాప్ ద్వారా ముచ్చటించుకునేవారు. తాను లండన్‌లో ఉంటున్నట్టు నమ్మించిన ఇస్సాక్ తాను కొంత డబ్బు ఇవ్వాలనుకుంటున్నానని, లండన్ వచ్చి తీసుకోవాల్సిందిగా నటుడికి చెప్పింది. అయితే తనకు లండన్ రావడం వీలుకాదంటూ ఆమెనే భారత్‌కు ఆహ్వానించాడు. దీంతో జనవరి 19న తాను ఇండియాకు వస్తున్నట్టు పేర్కొన్న ఇస్సాక్ తన పాస్‌పోర్ట్, టికెట్స్ కాపీని ఈమెయిల్ చేసింది.

తన ప్లాన్‌లో భాగంగా మరుసటి రోజు నటుడికి ఫోన్ చేసిన ఇస్సాక్ తాను  ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్నానని, లగేజీ పరిమితికి మించడంతో కస్టమ్స్ అధికారులు రూ.25,500 జరిమానా విధించారని, ఆ డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయాల్సిందిగా కోరడంతో అతడు ఆ మొత్తాన్ని పంపించాడు. ఆ తర్వాత మరో వ్యక్తి నటుడికి  ఫోన్‌చేసి తనను కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకుని ఇస్సాక్‌ను విడిచిపెట్టాలంటే మరో రూ.50 వేలు చెల్లించాలని చెప్పడంతో ఢిల్లీకి చెందిన బ్యాంక్ అకౌంట్‌కు రూ.50వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తర్వాత నటుడికి ఫోన్ చేసిన ఇస్సాక్ హైదరాబాద్ వచ్చేందుకు ఈ రోజు విమానాలు లేకపోవడంతో రేపు వస్తున్నట్టు చెప్పింది. అయితే తర్వాత రోజు లితిక అనే మహిళ నటుడికి ఫోన్ చేసి ఇస్సాక్ లండన్ కరెన్సీతో పట్టుబడిందని, నగదుతో సహా విడిచిపెట్టాలంటే రూ.1.2 లక్షలు చెల్లించాలని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన నటుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్లు  నొబేర్త్‌ ఛుక్వేదో, నిమ్‌మున్‌ కిమ్‌లను అరెస్టు చేశారు. నిందితుల్ని అరెస్టు చేసి మంగళవారం హైదరాబాద్‌ తీసుకువచ్చారు. అయితే, మోసపోయిన ఆ సినీ నటుడు ఎవరన్నది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. 

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more