దోమలు పెంచితే ఊచలు లెక్కించాల్సిందే!.. త్వరలో ఏపీలో కొత్త చట్టం

26-03-2017 Sun 07:48 | Andhra
దోమలేంటి?.. పెంపకం ఏంటి? జైలేంటి?.. అని ఆశ్చర్యపోతున్నారా? మరీ అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దోమలు పెంచితే నిజంగానే ఊచలు లెక్కపెట్టుకోవాల్సి వస్తుంది. అంతేకాదు భారీ జరిమానా కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. దోమల పెంపకం ఏంటి? అని తలబద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు. దోమల పెంపకం అంటే.. దోమలు పెరిగేందుకు అనువుగా అవకాశాలు సృష్టించడం.. అంటే ఇళ్ల పక్కన, రహదారుల  పక్కన, తోపుడు బళ్లు పరిసర ప్రాంతాల్లో దోమలు పెరిగే వాతావరణం సృష్టిస్తే తొలిసారి వెయ్యి రూపాయలు, రెండోసారీ అదే తప్పు చేస్తే రూ.5 వేలు జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోమల నియంత్రణకు కొత్త చట్టం తీసుకురాబోతోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. త్వరలోనే బిల్లు చట్టంగా మారనుంది.

ఈ చట్టం ప్రకారం దోమగుడ్ల నివారణకు ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా చర్యలు తీసుకోకుంటే రోజుకు వంద రూపాయల చొప్పున జరిమానా కట్టాల్సి ఉంటుంది. దోమల గుడ్ల పెరుగుదలకు కారణమయ్యే ఖాళీ స్థలాలు, హోటళ్లు, ఆహార నిల్వ సంస్థలు, భవన నిర్మాణ సంస్థలు, కల్యాణ మండపాలు, విద్యాసంస్థలు, మైనింగ్ ప్రాంతాలకు తొలిసారి రూ.25 వేలు, రెండోసారి రూ.50 వేలు ఫైన్ విధిస్తారు. అంతేకాదు నెల రోజుల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకూ ఇదే నియమం వర్తిస్తుంది. దోమల నివారణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన స్థానిక సంస్థల చైర్మన్లు, అథారిటీపైనా కేసులు నమోదు చేస్తారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more