అప్పుడు, నాగబాబుకు ఫోన్ చేసి పవన్ కల్యాణ్ తిట్టమన్నారు!: నటుడు సమీర్

23-03-2017 Thu 17:40 | Entertainment
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పాలైన సందర్భంలో తాను చేసిన వ్యాఖ్యల పర్యవసానం గురించి ఓ ఇంటర్వ్యూలో క్యారెక్టర్ ఆర్టిస్టు సమీర్ ప్రస్తావించాడు. ఆ సినిమా పరాజయం పాలవడంతో పవన్ అభిమానిని అయిన తాను చాలా నిరాశ చెందానని, ఆ సినిమా గురించి తన ఫేస్ బుక్ ఖాతాలో రాశానని చెప్పాడు. ఆ మర్నాడు ఉదయాన్నే నాగబాబు ఫోన్ చేసి తనకు చీవాట్లు పెట్టడంతో, ఆ పోస్ట్ ను తొలగించానని అన్నాడు. ఆ తర్వాత పనన్ కల్యాణ్  ఫోన్ చేసి ‘నీ అభిప్రాయం నువ్వు చెప్పావు. నాగబాబు తిట్టడం తప్పు. నువ్వు, ఇప్పుడు నాగబాబుకు ఫోన్ చేసి తిట్టు’ అని ఫోన్ లో పవన్ అన్నట్టు సమీర్ చెప్పాడు.

అయితే, తాను మాత్రం సైలెంట్ గా ఉండిపోయానని, ఫోన్ చేయలేదని చెప్పాడు. కట్ చేస్తే.. నాలుగేళ్ల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో విడుదలైన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ఓ పాత్రలో నటించాలని ఫోన్ వస్తే తాను వెళ్లానని, అక్కడే ఉన్న పవన్ కల్యాణ్ తనను పలుకరించి, తన గదిలోకి రమ్మనడంతో వెళ్లానని చెప్పాడు. ‘ఇక్కడున్నావు ఏంటీ?’ అని పవన్ ప్రశ్నించడంతో, ‘ఈ సినిమాలో నేను చేస్తున్నాను సార్’ అని బదులిచ్చానని సమీర్ చెప్పాడు. "పవన్ వెంటనే త్రివిక్రమ్ గారిని పిలిపించమని చెప్పడంతో, ఆయన అక్కడికి వచ్చారు. గతంలో నేను చేసిన ఫేస్ బుక్ పోస్ట్ గురించి త్రివిక్రమ్ కు చెప్పిన పవన్, ‘ఈ సినిమాలో మీకు నేను కావాలా, సమీర్ కావాలా?’ అనడంతో.. తనకు సమీరే కావాలని త్రివిక్రమ్ చెప్పారు. దీంతో, పెద్దగా నవ్విన పవన్, త్రివిక్రమ్ ను కౌగిలించుకోవడంతో.. వాళ్లిద్దరూ సరదాగా నన్ను ఆడుకుంటున్నారనే విషయం నాకు అర్థమైంది" అంటూ సమీర్ చెప్పుకొచ్చాడు. 

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more