నియోజకవర్గాల పెంపు ప్రసక్తే లేదన్న హోం శాఖ సహాయమంత్రి.. అబ్బే.. అదేం లేదన్న వెంకయ్య!

22-03-2017 Wed 06:31 | Both States
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై నిన్న(మంగళవారం) కొంత గందరగోళం నెలకొంది. నియోజకవర్గాల పెంపుపై టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ గంగారాం లోక్‌సభకు లిఖితపూర్వక  సమాధానం ఇచ్చారు. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను 119  నుంచి 153కు, ఏపీ‌లో 175 నుంచి 225 పెంచాల్సి ఉంది. పునర్విభజన ప్రక్రియను  2026 వరకు చేపట్టకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) చెబుతుండడం వల్ల అప్పటి వరకు అసెంబ్లీ స్థానాల్లో మార్పు చేర్పులు కుదరవని ఏజీ పేర్కొన్నారని, కాబట్టి 2026 తర్వాత 2021 జనాభా లెక్కల ఆధారంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను పెంచాల్సి ఉంటుందని మంత్రి సభకు తెలిపారు. మంత్రి ప్రకటనతో ఒక్కసారిగా ఏపీ, తెలంగాణలో కలకలం మొదలైంది. బ్రేకింగులతో న్యూస్‌చానెళ్లు హోరెత్తించాయి.

చానళ్ల బ్రేకింగులతో అప్రమత్తమైన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వెంటనే హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. లోక్‌సభలో హన్స్‌రాజ్ ఇచ్చిన సమాధానంపై చర్చించారు. అనంతరం అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై స్పష్టత ఇచ్చారు. ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాల పెంపునకు సంబంధించి కేంద్ర హోంశాఖలో కేబినెట్ నోట్ తయారవుతోందని పేర్కొన్నారు. హన్స్‌రాజ్ అప్పటికి తనకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఆ సమాధానం ఇచ్చి ఉండొచ్చని వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో నియోజకవర్గాల పెంపు ఖాయమని వెంకయ్య తేల్చి చెప్పారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more