భవిష్యత్తులో అతిపెద్ద ఇంటర్నెట్ కంపెనీగా అవతరించే ఛాన్స్ దీనికే!

21-03-2017 Tue 21:53 | National
సమాచార సాంకేతిక వ్యవస్థ కొత్తపుంతలు తొక్కుతోంది. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడంతో ప్రపంచం మొత్తం అరచేతిలో ఇమిడిపోతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో అతిపెద్ద ఇంటర్నెట్ కంపెనీ ఏది? అన్నదానిపై డావిన్సీ ఇనిస్టిట్యూట్‌ లో భవిష్యత్తును అంచనా వేసే మేధావిగా పేరు తెచ్చుకున్న థామస్‌ ఫ్రే పలు ఆసక్తికర అంశాలు చెప్పారు. ప్రపంచంలో అతిపెద్ద ఇంటర్నెట్‌ కంపెనీగా ఆన్‌ లైన్‌ ఎడ్యుకేషన్ ని నిర్వహించే పెద్ద కంపెనీయే నిలబడుతుందని ఆయన పేర్కొన్నారు.

అయితే ఆన్ లైన్ లో ఈ వ్యాపారాన్ని మనుషులు సమర్థవంతంగా నిర్వర్తించలేరని, ఈ వ్యాపారంలో రోబోలు అద్భుతంగా రాణిస్తాయని ఆయన చెప్పారు. ఒక ఉపాధ్యాయుడు ఒక తరగతి గదిలో ఉన్న విద్యార్థులనుద్దేశించి పాఠం చేబుతారని, అదే రోబో అయితే తరగతి గదిలోని ప్రతి విద్యార్థి మానసిక పరిస్థితిని అంచనా వేసి, ఆ విద్యార్థికి అర్ధమయ్యే రీతిలో పాఠాలు బోధిస్తుందని ఆయన అన్నారు. అంతే కాకుండా స్క్రీన్ ముందు కూర్చున్న విద్యార్థి ప్రతిభతోపాటు అభిరుచులను కూడా అంచనా వేసి అతనికి తగ్గట్టుగా పాఠాలు బోధిస్తుందని ఆయన అన్నారు.

అంతే కాకుండా వారాంతంలో హోం వర్క్‌ చేయడంలో ప్రతి విద్యార్థికి రోబో టీచర్లు చక్కగా సహకరిస్తారని ఆయన పేర్కొన్నారు. రోబో టీచర్ల రాక కారణంగా ప్రస్తుతం ఓ తరగతి సగటు విద్యార్థి ఏడాదిలో నేర్చుకుంటున్న విద్యను ఆరు నెలల్లోనే నేర్చుకునే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ఈ మార్పులన్నీ రానున్న 14 ఏళ్లలోనే చోటు చేసుకుంటాయని ఆయన పేర్కొన్నారు. కాగా, కృత్రిమ మేధస్సులో శరవేగంగా వస్తున్న మార్పులు, అంటే, గూగుల్‌ కంపెనీ అభివద్ధి చేస్తున్న డీప్‌ మైండ్, ఐబీఎం అభివద్ధి చేస్తున్న వాట్సన్‌ ఇంధన శక్తితో పనిచేసే రోబోలు, అమెజాన్‌ కంపెనీ అభివద్ధి చేస్తున్న డ్రోన్ సర్వీసు వ్యవస్థలను దృష్టిలో పెట్టుకొని థామస్‌ ఫ్రే ఈ అంచనాలను వేశారు.

 2030 నాటికి తన అంచనాలు నిజమవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని నాశనం చేస్తుందని పలువురు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కృత్రిమ మేధస్సు కారణంగా మానవాళికే ముప్పు పెరుగుతుందని, సైనిక అవసరాల్లో ఈ కృత్రిమ మేధస్సును వినియోగిస్తే దేశాలు అంతమైపోతాయని పలువురు గతంలో ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more