కపిల్! ఆడవాళ్ల ముందు అసభ్యంగా మాట్లాడడం మానుకో: సునిల్ గ్రోవర్ రిటార్ట్

21-03-2017 Tue 15:01 | Entertainment
కామెడీ నైట్ విత్ కపిల్ శర్మ షోతో హిందీ టీవీ పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదిగిన కపిల్ శర్మకు సహచరుడు సునీల్ గ్రోవర్ రిటార్ట్ ఇచ్చాడు. విమానంలో జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపం చెందిన సునీల్ గ్రోవర్ ఇప్పుడు మెత్తగా మొత్తాడు. తన ట్విట్టర్ లో సునీల్ గ్రోవర్ కపిల్ కు సూచనలు ఇస్తూ.... ‘కపిల్‌! నువ్వు నన్ను చాలా బాధపెట్టావు. నీతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎంతో నేర్చుకున్నాను. అందుకే నీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. కేవలం జంతువులను మాత్రమే కాకుండా మనుషులను కూడా గౌరవించు. ఎంటర్ టైన్ మెంట్ పరిశ్రమలో అందరూ నీ అంత సక్సెస్‌ అయినవారు కాదు. నీ అంత టాలెంట్‌ ఉన్న వారు కూడా కాదు. ఇకపోతే, అంతా నీ అంత టాలెంటెడ్‌ అయివుంటే ఇతరులు నీకు మాత్రమే ఎందుకు విలువిస్తారు? అయితే వారికి కూడా నీలాగే టాలెంట్ ఉంది. కాబట్టి ఇతరులపై కాస్త కృతజ్ఞత చూపించు. నీ తప్పును ఎవరైనా సరిచేస్తే వారిని తిట్టకు. మరీ ముఖ్యంగా వారిని ఆడవారి ముందు అసభ్యకరంగా మాట్లాడడం మానుకో. నీ స్టార్‌ డమ్‌ తో వారికొచ్చిన ఇబ్బందేమీ లేదు.

అయితే బై ఛాన్స్ వాళ్లంతా నీతో పాటు జీవితంలో ప్రయాణిస్తున్నవారు మాత్రమే. ‘ది కపిల్‌ శర్మ షో’ నీ కార్యక్రమం అని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఆ షో నుంచి నీకు నచ్చకపోతే ఎవరినైనా వెళ్లగొట్టే హక్కు నీకుందని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు. నువ్వు ఎంచుకున్న రంగంలో చాలా బాగా ఎదిగావు. మంచిదే...కానీ దేవుడిలా నటించకు. నీ గురించి నువ్వు కేర్‌ తీసుకో. నీకు జీవితంలో మరింత సక్సెస్‌, పేరు రావాలని ఆశిస్తున్నాను’ అంటూ పేర్కొన్నాడు. దీంతో ఇకపై కపిల్ శర్మతో సునీల్ గ్రోవర్ పని చేసే అవకాశం లేదని హిందీ బుల్లితెర నటులు అభిప్రాయపడుతున్నారు. కాగా, గతంలో సునీల్ గ్రోవర్ ఒకసారి ఈ షో నుంచి వెళ్లిపోగా, రేటింగ్స్ బాగా పడిపోయి, కపిల్ క్రేజ్ తగ్గిపోయిన సంగతి తెలిసిందే. మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పట్ల అభిమానులు కపిల్ పై మండిపడుతున్నారు. డబ్బుతెచ్చిన మదంతో కపిల్ ఇలా వ్యవహరిస్తున్నాడంటూ అభిమానులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.  


More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more