: ఆ సెలూన్ కి వెళితే.. కొండచిలువతో మసాజ్‌ చేయించుకోవచ్చు!

జర్మనీకి చెందిన ఫ్రాంక్‌ డొహ్లన్ అనే వ్యక్తి ఓ హెయిర్ కటింగ్ సెలూన్ న‌డుపుతున్నాడు. ఇక్కడి విశేషం ఏమిటంటే, ఆయ‌న.. మెడ‌నొప్పితో తన వ‌ద్ద‌కు వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ల‌కు ఓ కొండచిలువతో మసాజ్‌ చేస్తాడు. 13 సంవత్సరాలుగా ఆయ‌న ఓ కొండచిలువను పెంచుకుంటున్నాడు. ఓ రోజు ఆయ‌న త‌న ఇంటికి న‌డుచుకుంటూ వెళుతుండ‌గా ఆ  పాము దొరికింద‌ట‌. ఆ పామును చేర‌దీసి దానికి ఆయ‌న‌ మాంటీ అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఇప్పుడు అదే కొండచిలువ ఆయ‌న సెలూన్‌లో ప‌నిచేస్తోంది. ఆ పామును ఫ్రాంక్‌ తనతో పాటే షాప్‌లో ఉంచుకుంటాడు. ప్రతి రోజూ తాను చేస్తున్న మ‌సాజ్‌ను మాంటీతో చేయించాల‌నే ఆలోచ‌న ఆయ‌న‌కు రావ‌డంతో దానితో ఆ ప‌ని చేయించ‌డం మొద‌లు పెట్టాడు. అత‌డి ప్ర‌యోగం స‌క్సెస్ అయింది.

మాంటీ మెడకే కాకుండా ఒళ్లు నొప్పులకి కూడా మసాజ్ చేసేస్తోంది. ఆ పాము క‌స్ట‌మ‌ర్ల‌ శరీరానికి చుట్టుకొని గట్టిగా అదుముతూ ఉంటుంది. దీంతో ఒళ్లు నొప్పులు అన్నీ తగ్గిపోతాయన్న నమ్మకంతో, క‌స్ట‌మ‌ర్లు మసాజ్‌ చేయించుకుంటున్నారు. అయితే, ఈ మ‌సాజ్ చేసినందుకు గానూ ఫ్రాంక్ డ‌బ్బులు తీసుకోకుండా, ఆ కొండచిలువ ఆహారం కోసం మాత్రం విరాళాలు ఇస్తే చాల‌ని చెబుతున్నాడు.

More Telugu News