కడపలో ఉత్కంఠ.. జగన్‌కు నిద్రను దూరం చేస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలు!

20-03-2017 Mon 06:37 | Andhra
కడప ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నేడు (సోమవారం) ఫలితాలు వెలువడనుండడంతో రాజకీయ నాయకుల దృష్టి అటువైపు మళ్లింది. టీడీపీ గెలుపుపై ధీమాగా ఉండగా వైసీపీ క్రాస్ ఓటింగ్‌ను నమ్ముకుంది. ఎమ్మెల్సీ స్థానం కోసం వైసీపీ తరపున పోటీ పడిన వైఎస్ వివేకానందరెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు సోదరుడు. సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి. 1981లో రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీగానూ ఎన్నికయ్యారు. వైఎస్ మరణానంతరం జగన్ వైసీపీని ఏర్పాటు చేసినా ఆయన మాత్రం కాంగ్రెస్‌ను వీడలేదు. 2010లో కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో వ్యవసాయమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు. ఇప్పుడు జగన్ ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు.

టీడీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి అలియాస్ బీటెక్ రవి రెండు దశాబ్దాలుగా టీడీపీలో ఉన్నారు. కర్ణాటకలో బీటెక్ పూర్తిచేసిన ఆయన 2011లో జరిగిన ఉప ఎన్నికలో పులివెందుల నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల ఫలితాల కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ ఎదురుచూస్తున్నాయి. కాగా ఈ ఎన్నిక వైసీపీ చీఫ్ జగన్‌కు సవాలుగా మారడంతో ఆయనకు కంటిమీద కనుకు కరువైంది. కడప జిల్లాలో వైసీపీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోవాలంటే వివేకానందరెడ్డి గెలుపు చాలా అవసరం.  మరోవైపు చంద్రబాబు ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం 839 ఓట్లు పోలవగా, బీటెక్ రవికి 449 ఓట్లు, వివేకాకు 390 ఓట్లు పడినట్టు టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో వైసీపీ క్రాస్ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకుంది. టీడీపీలో ఉన్న వైఎస్ అభిమానులు తమకే ఓటు వేసుంటారని వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కోడ్ విధానాన్ని అవలంబించి ప్రజాప్రతినిధులు చేజారిపోకుండా చూసుకుంది. ఫలితంగా క్రాస్ ఓటింగ్‌ను నిలువరించినట్టు చెబుతోంది. దీంతో ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపారన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  ఎవరు గెలిచినా ఓట్ల తేడా పది నుంచి 20 మధ్యే ఉంటుందని చెబుతున్నారు. వైసీపీ కనుక ఇక్కడ ఓడిపోతే జిల్లా రాజకీయం ఆసక్తిగా మారుతుందనడంలో సందేహం లేదు. వైఎస్ కుటుంబాన్ని ఓడించి చరిత్ర సృష్టించాలని భావిస్తున్న టీడీపీ ఆశలు నెరవేరుతాయో? లేదో? చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more