నాకు ఎప్పుడూ చిరంజీవి గారే హీరో... నేను హీరోను కాదు!: పవన్ కల్యాణ్

18-03-2017 Sat 22:23 | Entertainment
'ఈ మధ్యన ఇలాంటి సభల్లో మాట్లాడడం అలవాటు తప్పింది. అందుకే కొత్తగానూ, కాస్త బెరుగ్గాను ఉంద'ని పవన్ కల్యాణ్ అన్నారు. కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ, 'ఎంత ఫంక్షన్ చేసినా సరిపోదు. అందుకే పరిమితుల్లో ప్రీరిలీజ్ వేడుక జరగాలని చిన్నగా ఫంక్షన్ చేయాలని కోరాన'ని అన్నారు. తాను అభిమానులపై ప్రేమతోనే చిన్న ఆడిటోరియంలో వేడుక నిర్వహించాలని ఇలా చేశానని ఆయన చెప్పారు. 'అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. టెక్నీషియన్ అవుదామని భావించాను, హీరోనైపోయిను. అయితే తోటపని అయినా, వీధులూడ్చే పని అయినా నిజాయతీతో చిత్తశుద్ధిగా చేస్తా'నని పవన్ కల్యాణ్ అన్నారు. ఇన్నేళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకుని పని చేశానని, భవిష్యత్ లో తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో చేస్తానని అన్నారు. తాను జీవితంలో నేర్చుకున్న చాలా అంశాలు సినిమాల్లో వచ్చాయని ఆయన చెప్పారు.

 త్రివిక్రమ్ తనకు 'గోకులంలో సీత' సినిమా నుంచి తెలుసని అన్నారు. "గోకులంలో సీత' సినిమాలో ప్రేమ సర్వం, ప్రేమే అన్నింటికి మూలం అన్నది తెలుసుకున్నా. ఆ డైలాగ్ త్రివిక్రమ్ రాశారు. అలాగే 'సుస్వాగతం'లో తండ్రి మరణిస్తే తిరిగే కుర్రాడిపాత్రలో చాలా ఏడ్చాను. నా జీవితంలో చాలా కదిలించిన సన్నివేశాలు సినిమాల్లో ఉన్నాయి' అని పవన్ చెప్పారు. 'తొలి ప్రేమ' సమయంలో బాధ్యత లేని ప్రేమ ఏం ప్రేమ అనిపించేదని అన్నారు. తనలో భావాలను సినిమా రూపంలో చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. 'తమ్ముడు' సినిమాకి ప్రాణాలు ఫణంగా పెట్టేశానని ఆయన చెప్పారు. ఒక పిచ్చి ఉన్మాదంలో ఆ సినిమాలో చేశాను కానీ ఇప్పటికీ రాత్రిళ్లు చేతులు నొప్పిపెడుతుంటాయని పవన్ చెప్పారు. నువ్వు చేయ్యలేవని చెప్పడానికి నువ్వెవరు? అని ప్రశ్నించడమే తమ్ముడు సినిమా అని, అందుకే దానికి ట్రావెలింగ్ సోల్జర్ అని ట్యాగ్ లైన్ పెట్టానని ఆయన అన్నాడు.

'బద్రి'లో నువ్వు నందా అయితే ఏంటి? అన్న ప్రశ్న తన జీవితమని అన్నారు. నీ ఎక్కువ ఏంటి? నువ్వు కూడా మనిషివే అని గుర్తు చేయడమని పవన్ తెలిపారు. 'ఖుషీ' సినిమాలో నా దేశాన్ని ప్రేమించడం తనకు చాలా ఇష్టమని చెప్పదానికే ఏ మేరా జహా పాటను పెట్టానని పవన్ చెప్పారు. ఖుషీ సినిమా చేస్తున్నప్పుడు మధ్యలో కీడు శంకించిన తాను, గబ్బర్ సింగ్ సినిమా వరకు కోలుకోలేదని పవన్ కల్యాణ్ అన్నారు. గబ్బర్ సింగ్ లో పోలీస్ స్టేషన్ సీన్ చేస్తున్నప్పుడు ఖుషీ టైంలో కోల్పోయిన శక్తి మళ్లీ వచ్చిందని గుర్తుచేసుకున్నారు. 'నాకెప్పుడూ చిరంజీవిగారే హీరే... నేను హీరోను కాదు' అన్నారు పవన్.

'ఓసారి 5 కిలోమీటర్లు దూరం వరకు ఊరేగింపు చేస్తామని చెబితే, నేనేమన్నా గంగిరెద్దునా సర్? అని అడిగానని, అందుకే తన స్నేహితులకు చెప్పి కారు రెడీగా ఉంచండి.. నేను వచ్చేస్తానని చెప్పానని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే రోడ్డుమీదకి వెళ్లేసరికి రోడ్లు కిక్కిరిసిపోయేలా జనాలు ఉన్నారని ఆయన చెప్పారు. అప్పుడు తన తండ్రి చెప్పిన 'ఈ ప్రపంచంలో అందరూ సమానమే అన్న విషయం గుర్తించుకో' అన్న విషయం ప్రతి క్షణం గుర్తుంచుకుంటానని ఆయన చెప్పారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more