మార్కెట్లో రిలయన్స్ జియో హవాలో మార్పులుండవు: ఓ రీసెర్చ్‌లో ఆస‌క్తిక‌ర విష‌యాలు

18-03-2017 Sat 15:03 | Technology
ఉచిత మంత్రంతో మార్కెట్లోకి వ‌చ్చిన రిల‌య‌న్స్ జియో వ‌చ్చేనెల నుంచి టారిఫ్ ప్లాన్ల‌ను అమ‌లులోకి తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, జియో ఉచిత ఆఫ‌ర్లు ముగియ‌గానే వినియోగ‌దారులు ఆ సిమ్ కార్డుల‌ను తీసి ప‌క్క‌కు పెట్టేస్తార‌ని ఎన్నో ఊహాగానాలు వ‌చ్చాయి. అయితే, బ్రోక‌రేజ్ కంపెనీ బెర్న్ స్టెయిన్ నిర్వ‌హించిన ఓ రీసెర్చ్‌లో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిశాయి. ఈ రీసెర్చ్‌లో 40 శాతం మంది మెట్రో సిటీలకు చెందిన యూజ‌ర్లు, 30 శాతం మంది ఏ-సర్కిల్స్, 20 శాతం మంది బి-సర్కిల్స్, 10 శాతం మంది సీ-సర్కిల్స్ కు చెందిన వారు పాల్గొన్నారు.

ఈ రీసెర్చ్ ద్వారా రిల‌య‌న్స్ జియోకు క‌స్ట‌మ‌ర్లు జై కొడుతూనే ఉంటార‌ని తేలింద‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు పేర్కొన్నారు. కేవలం 8 శాతం మంది జియో వినియోగ‌దారులు మాత్రమే ఆ సిమ్ వాడకాన్ని నిలిపివేస్తామని తెలిపారు. అంతేకాదు, జియోకు సమానంగా మార్కెట్లో ఉన్న ఇతర టెల్కోలు ఆఫర్లిస్తేనే అలా చేస్తామ‌ని అన్నారు. రిల‌య‌న్స్ జియో మంచి  సర్వీసు, డేటా కవరేజ్, డేటా స్పీడ్, హ్యాండ్ సెట్ ఛాయిస్ అందిస్తోంద‌ని వినియోగ‌దారులు తెలిపారు. వ‌చ్చే నెల 1 నుంచి ఆ కంపెనీ ప్ర‌క‌టించిన‌ట్లుగా నెలకు రూ.303 రీఛార్జీ చేసుకుని ఆ సిమ్‌నే సెకండ‌రీ సిమ్‌గా వాడ‌తామ‌ని 67 శాతం మంది యూజర్లు తెలిపారు. దీంతో ఉచిత ఆఫ‌ర్లు లేక‌పోయిన‌ప్ప‌టికీ జియో వినియోగ‌దారులు జియోవైపే ఉన్నార‌ని రీసెర్చ్ ద్వారా పేర్కొన్నారు. ఈ రీసెర్చ్‌ను వెయ్యిమంది శాంపుల్స్ డేటాతో బెర్న్ స్టెయిన్ నిర్వ‌హించింది.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more