ఆ విషయంలో భారత్ కంటే చైనా ఎంతో ముందంజలో ఉంది: ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే

17-03-2017 Fri 12:42 | National
శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా భారత్, చైనా ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. 2030 నాటికి ఈ దేశాలే ప్ర‌పంచంలో అగ్ర‌స్థానంలో ఉంటాయ‌ని కూడా ప‌లు సంస్థ‌లు ఇప్ప‌టికే తేల్చి చెప్పాయి. అయితే, ప‌లు రంగాల్లో చైనాకి గ‌ట్టిపోటీనిస్తోన్న భార‌త్‌.. డిజిటల్ స్పేస్ లో మాత్రం ఆ దేశం కంటే ఎంతో వెన‌క‌బ‌డిపోయింది. తాజాగా ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన సర్వేలో పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం ఈ రెండు దేశాల్లో చైనా శరవేగంగా దూసుకెళుతోంది. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వాడకంలో చైనా ముందంజలో ఉందని,  గ‌త ఏడాది దాకా ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉందని అందులో పేర్కొన్నారు.

చైనాలో 71 శాతం మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తుండగా మ‌న‌దేశంలో మాత్రం 21 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ వాడుతున్నారని అందులో చెప్పారు. చైనాలో 68 శాతం మంది స్మార్ట్ ఫోన్లు వాడుతుండ‌గా మ‌న‌దేశంలో 18 శాతం మంది మాత్ర‌మే స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. 2013 నుంచి చైనాలో స్మార్ట్ ఫోన్ ఓనర్ షిప్ 31 శాతం పెరిగితే ఆ సమయంలో భారత్ లో మాత్రం 6 శాతమే పెరిగిందని స‌ర్వే ద్వారా తెలిసింది. కాగా, బేసిక్ స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నవారు ఆ దేశంలో 98 శాతం మంది ఉంటే మ‌న‌దేశంలో 72 శాతం మంది  మాత్రమే ఉన్నారు. చైనాలో 72 శాతం మంది పట్టణ ప్రాంత‌ ప్రజలు స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల్లో 63 శాతం మందికి స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయ‌ని తెలిపింది. ఇక మ‌న‌దేశంలో మాత్రం పట్టణ ప్రాంతాల్లో 29 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 13 శాతం మంది ప్ర‌జ‌లు స్మార్ట్ ఫోన్లు ఉప‌యోగిస్తున్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more