పెళ్లి చేసుకోకూడదనుకున్నాను.. కానీ నాన్న సర్దిచెప్పడంతో చేసుకున్నాను!: భూమా కూతురు మౌనిక

16-03-2017 Thu 18:16 | Both States
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి రాయలసీమలో మంచి నేతగా పేరు సంపాదించిన విషయం తెలిసిందే. నాగిరెడ్డి తన కుటుంబ సభ్యులపై కూడా ఎనలేని ప్రేమ చూపిస్తూ ఉండేవారు. ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డి కూతురు మౌనిక ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘నాన్న ఎప్పటికీ నా హీరోనే. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా.. నాన్న ఫోన్ చేస్తున్నారంటే అటెన్షన్ కు వచ్చేసే దానిని. ఆ భయం .. గౌరవం ఎప్పటికీ ఉంటాయి. నా తండ్రి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు లారెన్స్ స్కూల్లో నన్ను వదిలిపెట్టడానికి నాన్న వచ్చినప్పుడు, నేను చాలా ఏడ్చాను. నేను, నాన్న షర్టు పట్టుకుని పీకితే బటన్స్ అన్నీ ఊడిపోయాయి...

ఫ్యాక్షన్ పరిస్థితుల కారణంగా నాన్న ప్రయాణిస్తున్న జీపులో ఎక్కాలన్నా భయపడే వాళ్లం. ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే.. ఒకే రూటులో వెళ్లే వాళ్లం కాదు .. ఓన్లీ నైట్ జర్నీస్ చేసే వాళ్లం.. ఒకే డ్రైవర్ ఉండే వాడు కాదు.. మారుస్తూ ఉండే వాళ్లం.. 'నీకు చదువులో స్టేట్ ర్యాంక్స్ రాకపోయినా ఫర్వాలేదు.. పాసయితే చాలు, నేను హ్యాపీగా ఉంటాను' అని నాన్న అనేవారు... నాన్న ఉన్నన్ని రోజులు మమ్మల్ని సంతోషపరచాలని చూశారు. రోడ్డు ప్రమాదంలో అమ్మ మృతి చెందిన తర్వాత నా మైండ్ లో నుంచి మ్యారేజ్ చేసుకోవాలనే విషయాన్నే తీసేశాను.

అయితే, నాన్న నాకు సర్దిచెప్పడంతో పెళ్లి చేసుకున్నాను. నాన్న ఆ రోజు చెెప్పిన మాటలు నా మైండ్ లో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. అమ్మ పోయిన తర్వాత నాన్న ఉండలేకపోయారని నా ఫీలింగ్.. అమ్మ వీడియోస్ చూపించమని నాన్న, పదే పదే మమ్మల్ని అడిగేవారు. అయితే, ఆ వీడియోస్ చూసి నాన్న మరింత కుంగిపోతాడనే భయంతో మేము ఆ వీడియోస్ పెట్టే వాళ్లం కాదు.. ఆ వీడియోస్ పెట్టకపోయినా, నాన్న మనసులో అమ్మ గురించిన ఆలోచనలే ఉంటాయని తెలుసు... అమ్మ, నేను సరదాగా కొట్టుకునే వాళ్లం. అప్పుడు, నాన్న నన్ను మరింత ఎంకరేజ్ చేసేవారు. మా తమ్ముడు కూడా మా నాన్నను సరదాగా ‘ఏం నాగిరెడ్డి?’ అనే వాడు.. నాన్న చెస్ బాగా ఆడేవారు. బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్ కూడా బాగా ఆడేవారు..’' అంటూ తన తల్లిదండ్రులతో తన అనుబంధాన్ని మౌనిక గుర్తుచేసుకున్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more