అటో ఇటో తేల్చుకోవాల్సిందే.. వెనకడుగు వేస్తే నవ్వులపాలవుతాం.. శశికళ భర్త నటరాజన్

12-02-2017 Sun 06:56 | National
క్షణానికో మలుపు తిరుగుతున్న తమిళ రాజకీయాలు మధుబాబు 'షాడో' నవలలను తలపిస్తున్నాయి. గవర్నర్ నుంచి సానుకూల సంకేతాలు అందకపోవడంతో ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పుకునేందుకు శశికళ  సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆమె నిర్ణయాన్ని ఎమ్మెల్యేలతోపాటు కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మీరు ఉంటేనే పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా మరొకరిని ప్రకటిస్తే అసలుకే మోసం వచ్చే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యేలు శశికళను హెచ్చరించినట్టు తెలుస్తోంది. ‘‘వ్యక్తిగతంగా పన్నీర్ సెల్వంపై మాకు వ్యతిరేక భావం లేదు. మీరు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే మీకు అండగా నిలబడ్డాం’’ అని ఆమెకు వివరించినట్టు తెలుస్తోంది.

మరోవైపు శశికళ కుటుంబ సభ్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆటను మధ్యలో వదిలేయడం సరికాదని, ఇంత జరిగాక వెనక్కి తగ్గితే నవ్వులపాలవడం ఖాయమని శశికళ భర్త నటరాజన్ పేర్కొన్నట్టు సమాచారం. గవర్నర్‌ను కనుక ఒప్పించగలిగితే వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు సైతం తిరిగి పరిగెత్తుకుంటూ వస్తారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే జరగాల్సింది జరిగిపోయిందని, ఇప్పుడు పునరాలోచించి ప్రయోజనం లేదని శశికళతో సూటిగానే చెప్పినట్టు సమాచారం.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more