చంద్రబాబు నాయుడుకి అందితే కేసీఆర్ జుట్టును కూడా ప‌ట్టుకుంటారు: చంద్రబాబుపై జగన్ ఆగ్రహం

06-02-2017 Mon 14:08 | Andhra
చంద్ర‌బాబు నాయుడు అధికారం కోసం ఆనాడు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచారని, మరోవైపు ఎన్నిక‌ల సమయంలో మాత్రం ఎన్టీఆర్ విగ్ర‌హాల‌కు పూల‌దండ‌లు వేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా ద్వారా ఆయకట్టుకు సాగునీటిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఉర‌వ‌కొండ‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన మ‌హాధ‌ర్నాలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. చంద్ర‌బాబు నాయుడు రోజుకో తీరుగా మాట్లాడ‌తార‌ని ఆయ‌న అన్నారు. మోదీ బ‌ల‌హీనంగా ఉన్న‌ప్పుడు ఆయ‌న‌తో ఢీ అంటారని, అదే మోదీ బ‌లంగా ఉన్న‌ప్పుడు ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లి స్నేహం అంటారని జ‌గ‌న్ అన్నారు.

చంద్ర‌బాబుకి అందితే కేసీఆర్ జుట్టును కూడా ప‌ట్టుకుంటారని, లేదంటే కాళ్లు పట్టుకుంటారని జగన్ విమ‌ర్శించారు. ఓ ప‌క్క ఆంధ్ర‌ ప్రాంతంలోని నీళ్ల‌ను కేసీఆర్ లాక్కెళ్లిపోతోంటే చంద్రబాబు ఆయనను ప్ర‌శ్నించ‌డం లేదని ఆయ‌న అన్నారు. మరో రెండేళ్లు పోతే ఎన్నిక‌లు వ‌స్తాయని, ఆ త‌రువాత మ‌న ప్ర‌భుత్వమే వ‌స్తుంద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఆ త‌రువాత‌ హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తాన‌ని జ‌గ‌న్ అన్నారు. మంచి చేసినా చేయ‌క‌పోయినా ప్ర‌చారం చేసుకుంటే చాలు, మ‌ళ్లీ ఓట్లు ప‌డ‌తాయ‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ని, వీటన్నిటినీ ప్రజలు గ‌మ‌నిస్తున్నార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీని బంగాళాఖాతంలో క‌లిపేస్తార‌ని జ‌గ‌న్ అన్నారు. చంద్ర‌బాబు, రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఇద్ద‌రినీ ప్ర‌జ‌లు గుర్తుంచుకుంటార‌ని, అయితే, ఏ ప్రాంతంలోనైనా నీరు క‌నిపిస్తే రాజ‌శేఖ‌ర్ రెడ్డిని త‌ల‌చుకుంటార‌ని, ఎక్క‌డ‌యినా మోసం జ‌రుగుతున్న‌ట్లు క‌నిపిస్తే చంద్ర‌బాబు నాయుడిని గుర్తుచేసుకుంటార‌ని జ‌గ‌న్‌ చమత్కరించారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more