రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు.. తమిళనాడులో ప్రకంపనలు.. వివరణ ఇచ్చిన సూపర్ స్టార్!

06-02-2017 Mon 07:10 | National
సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్నాయి. కొందరిలో కలవరం పుట్టిస్తున్నాయి. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని గతంలో పలుమార్లు పేర్కొన్న ఆయన తాజాగా ‘పవర్ అంటే ఇష్టమే’నని పేర్కొనడం సంచలనంగా మారింది. రజనీకాంత్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారనే దానికి ఆయన తాజా వ్యాఖ్యలు సంకేతమని చెబుతున్నారు. అంతేకాదు, బీజేపీ మద్దతుతో సొంతంగా రాజకీయ పార్టీ కూడా ప్రారంభించనున్నారనే ఊహాగానాలు ఇప్పుడు తమిళనాడులో ఊపందుకున్నాయి.

జయలలిత మృతి తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రజనీకాంత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడం ఒక్క రజనీ వల్లే సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. పన్నీర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి చాకచక్యంగా తప్పించిన శశికళ సీఎం పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిమానులు చెబుతున్నారు. అంతేకాదు, రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ పెద్ద ఎత్తున సందేశాలు సైతం  పంపుతున్నారు.

తన రాజకీయ రంగ ప్రవేశంపై వెల్లువలా వచ్చిపడుతున్న సందేశాలు, విస్తృతంగా ప్రచారమవుతున్న ఊహాగానాలతో ఉక్కిరిబిక్కిరి అయిన రజనీకాంత్ తర్వాత స్పందించారు. తను పేర్కొన్న ‘పవర్’ ఆధ్యాత్మికతకు సంబంధించినదంటూ వివరణ ఇచ్చారు. ఆధ్యాత్మిక దృష్టితో ఆ మాటను అన్నాను తప్పితే రాజకీయ ఉద్దేశంతో కాదని వివరణ ఇచ్చారు. డబ్బు, కీర్తి.. ఈ రెండింటిలో ఏది కావాలని అడిగితే తను ఆధ్యాత్మికతనే ఎంచుకుంటానని తేల్చిచెప్పారు. దానికే అంత శక్తి (పవర్) ఉంటుందని పేర్కొన్నారు. తాను ఆ ఉద్దేశంతోనే అన్నాను తప్పితే రాజకీయ కోణంలో కాదని, తన మాటలను మరోలా తీసుకోవద్దని అభిమానులను కోరారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more