తాడోపేడో తేల్చుకోవడానికి.. త‌మిళ నిర్మాతల సంఘం ఎన్నిక‌ల బ‌రిలోకి విశాల్‌.. నామినేష‌న్ దాఖ‌లు

05-02-2017 Sun 09:06 | National
కోర్టు ఉత్త‌ర్వుల మేర‌కు త‌మిళ న‌టుడు విశాల్‌పై నిర్మాతల మండ‌లి విధించిన స‌స్పెన్ష‌న్‌ను ఎత్తివేయ‌డంతో జోరుమీదున్న విశాల్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేందుకు సిద్ధ‌మ‌య్యాడు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న త‌మిళ నిర్మాతల సంఘం ఎన్నిక‌ల్లో తాడోపేడో తేల్చుకోవాల‌ని నిర్ణ‌యించాడు. ఈ మేర‌కు శ‌నివారం మ‌ధ్యాహ్నం అధ్యక్ష ప‌ద‌వికి నామినేష‌న్ దాఖ‌లు చేశాడు. నిర్మాత‌లు ప్రకాశ్‌రాజ్‌, పాండిరాజ్‌, ఎస్ఆర్ ప్ర‌భు, మిష్కిన్‌, జ్ఞాన‌వేల్ రాజా, సీవీ కుమార్‌, ఎస్ఎస్ కుమర‌న్‌, ఆర్కే సురేష్ త‌దిత‌రులు విశాల్‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌లహాస‌న్ కూడా విశాల్‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో ఈ సారి ఈ ఎన్నిక‌లు రాజ‌కీయ కోణం సంత‌రించుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. విశాల్ నామినేష‌న్ ప‌త్రంలో క‌మ‌ల్ కూడా సంత‌కం చేశారు.

గ‌తేడాది న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా పోటీ చేసి విజ‌య దుందుభి మోగించిన విశాల్ తాజా ఎన్నిక‌ల్లోనూ స‌త్తా చాటాల‌ని భావిస్తున్నాడు. వ‌చ్చే నెల 5న మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రాజేశ్వ‌ర‌న్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. విశాల్ నామినేష‌న్‌తో ఈ ప‌దవికి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ఖుష్బూ పోటీ నుంచి త‌ప్పుకుంది. కార్య‌ద‌ర్శి, లేదంటే కోశాధికారి ప‌ద‌వికి ఆమె పోటీ చేసే అవ‌కాశం ఉంది.  ఈ సంద‌ర్భంగా విశాల్ మాట్లాడుతూ తాను త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేశాడు. గెలిచాక హామీలు నెరవేర్చ‌కుంటే వెంట‌నే రాజీనామా చేస్తాన‌ని పేర్కొన్నాడు. అంతేకాదు కావాలంటే రాజీనామా లేఖ‌ను కూడా ఇప్పుడే ఇస్తాన‌ని చెప్పాడు.
 

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more