భుజంపై తన తల్లి మృతదేహాన్ని పది గంటలు మోసుకెళ్లిన జవాను!

02-02-2017 Thu 19:13 | National
ప‌ఠాన్ కోట్‌లో తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న అందరితో క‌న్నీరు పెట్టిస్తోంది. ఆ ప్రాంతంలో జ‌వానుగా విధులు నిర్వ‌ర్తిస్తోన్న మహ్మద్‌ అబ్బాస్‌ వద్ద అతని తల్లి కూడా ఉంటోంది. అయితే, ఆమె గత ఐదు రోజుల క్రితం మృతి చెందింది. త‌న త‌ల్లి మృతదేహాన్ని నియంత్రణ రేఖ వద్ద ఉన్న కర్ణా అనే గ్రామంలోకి తీసుకెళ్లి ఖననం చేయాలని మ‌హ్మ‌ద్ అబ్బాస్‌ అనుకున్నాడు. అందుకోసం కశ్మీర్‌కు తన తల్లి మృతదేహంతో చేరుకున్నాడు. ఆ స‌మ‌యంలో 50 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉండగా దారి మధ్యలో ఓ భారీ మంచుకొండ చరియ విరిగి పడడంతో స్పందించిన అధికారులు ఆ జవానుకు హెలికాప్టర్ ద్వారా సాయం చేస్తామ‌ని అన్నారు. త‌న‌ తల్లి మృత‌దేహాన్ని అక్కడే ఉంచి హెలికాప్టర్‌ కోసం ఎదురు చూసిన జ‌వానుకు నిరాశే మిగిలింది. నాలుగు రోజులుగా హెలికాఫ్ట‌ర్ రాలేదు.

ఎంత‌కీ హెలికాప్టర్ రాక‌పోవ‌డంతో ఆమె మృతదేహాన్ని తన భుజాన వేసుకొని అబ్బాస్ సుమారు ఆరు మీటర్ల మేర పేరుకుపోయిన మంచులో నుంచి పది గంటలపాటు న‌డిచాడు. ఆయ‌న‌కు మరికొంతమంది సాయం చేశారు. ఇది త‌న‌కు జ‌రిగిన పెద్ద అవమానమ‌ని, త‌న‌ తల్లికి గౌరవ ప్రదంగా అంత్యక్రియలు చేయలేకపోయానని ఆ జ‌వాను ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. త‌మ అధికారులు త‌న‌కు సాయం చేయ‌డానికి హెలికాప్టర్‌ పంపిస్తామని చెప్పి ఎంత‌కూ పంపించ‌లేద‌ని అన్నాడు. తాను మంచుముక్కలపై ప్రమాదకర స్థితిలో నడుచుకుంటూ త‌న‌ తల్లి మృతదేహాన్ని భుజాన వేసుకొని తీసుకెళ్లానని చెప్పాడు.

పక్కన తల్లి శవాన్ని పెట్టుకుని నాలుగు రోజుల పాటు ఎదురుచూసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయాడు.  అంతేగాక, ఈ రోజు త‌న‌ ఫోన్‌ కూడా కట్‌ చేశారని ఆయ‌న చెప్పాడు. అందుకే తాను త‌న త‌ల్లిని భుజంపై మోసుకెళ్లాల్సి వ‌చ్చింద‌ని అన్నారు. మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై అధికారులు స్పందిస్తూ తాము ఈ రోజే హెలికాప్టర్‌ సిద్ధం చేశామని అన్నారు. అయితే, హెలికాప్టర్‌ దిగే చోటులేకపోవడంతో వారే వద్దన్నారని అంటున్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more