నాడు ఫీజ్ కట్టలేక బడికి దూరం.. నేడు రెజ్లర్ గా కీర్తి కిరీటం!

30-01-2017 Mon 22:11 | Sports
ప్రముఖ రెజ్లర్ దలీప్ సింగ్ రానాను ‘ది గ్రేట్ ఖాలి’ గా అభిమానులు ఆరాధిస్తుంటారు. రెజ్లింగ్ లో పట్టు సాధించి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దలీప్ సింగ్ తన ఆత్మకథను ‘ది మ్యాన్ హూ బికేమ్ ఖాలి’ అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో తన చిన్నవయసులో పాఠశాల ఫీజు కట్టలేక  పొందిన వేదన, అవమానం, రెజ్లర్ కావాలనే ఆసక్తి తదితర విషయాలను ప్రస్తావించారు.

వినిత్ కె.బన్సల్ తో కలిసి దలీప్ సింగ్ రూపొందించిన ఈ పుస్తకంలో 1979లో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావించాడు. రెండో తరగతి చదువుతున్న సమయంలోఉపాధ్యాయులు చెప్పేది తనకు అర్థమయ్యేది కాదని, అంతేకాకుండా, పాఠశాల ఫీజు తాను కట్టలేకపోవడంతో యాజమాన్యం తిట్టిపోసేదని, తోటి విద్యార్థులు తనను చూసి నవ్వుతుండేవారని పేర్కొన్నాడు. ఫీజు కట్టకపోవడంతో ప్రిన్సిపాల్ ఇబ్బంది పెడుతుండేవాడని, ఈ బాధ పడలేక చదువు మానేసి తల్లిదండ్రులకు సాయంగా ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నాడు.

ఓ సారి దలీప్ తండ్రి వద్దకు ఓ వ్యక్తి వచ్చి గ్రామంలో తోట పని ఉందని, రోజుకు రూ.5 వస్తాయని చెప్పాడట. అప్పట్లో చేతిలో రెండు రూపాయలు కూడా లేని సమయంలో రోజుకు ఐదు రూపాయలు వస్తాయంటే తనకు చాలా సంతోషం వేసిందని, కష్టపడి పని చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నానని చెప్పాడు. అయితే, దలీప్ ది చిన్నవయసు కావడం, అంత బలం ఉండదని భావించి దలీప్ కు పని ఇచ్చేందుకు ఆ వ్యక్తి ఒప్పుకోలేదట. అయితే, ఎనిమిదేళ్ల వయసు ఉన్న దలీప్, ఏదో విధంగా పని సంపాదించి తల్లిదండ్రులకు సాయపడ్డాడట. పని చేసుకుంటూ, రెజ్లర్ కావాలనే తన కలను సాకారం చేసుకున్నానని చెప్పాడు. అయితే, ఒకప్పటి తన ఆకారాన్ని చూసి ఎగతాళి చేసే వారని, దానిని పాజిటివ్ గా తీసుకుని తన లక్ష్యాన్ని సాధించానని, వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకోవడంతో అన్ని భయాల నుంచి బయటపడ్డానని తన ఆత్మకథలో దలీప్ పేర్కొన్నాడు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more