వ‌రుడు లేకుండానే అట్ట‌హాసంగా పెళ్లి.. వ‌ధువును ఆశీర్వ‌దించి కానుక‌లు అందించిన‌ బంధుమిత్రులు!

28-01-2017 Sat 07:10 | Offbeat
త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి జిల్లాలో శుక్ర‌వారం ఓ విచిత్ర పెళ్లి జ‌రిగింది. వ‌రుడు లేకుండానే అట్ట‌హాసంగా జ‌రిగిన ఈ పెళ్లిని చూసేందుకు చుట్టుపక్క‌ల వారు కూడా త‌ర‌లివ‌చ్చారు. వ‌ధూవ‌రుల కుటుంబ స‌భ్యుల క‌థ‌నం ప్ర‌కారం.. ప‌ద్మ‌నాభపురానికి చెందిన సోఫియాకు పేచ్చిపారైకి చెందిన అజారుద్దీన్‌కు పెళ్లి కుదిరింది. ముస్లిం సంప్రదాయం ప్ర‌కారం ఇటీవ‌ల ఘ‌నంగా నిశ్చితార్థం కూడా జ‌రిగింది. కంప్యూట‌ర్ ఇంజినీర్ అయిన‌ అజారుద్దీన్ ఉద్యోగ రీత్యా సౌదీలో ఉంటున్నాడు. వీరి వివాహం కోసం  శుక్ర‌వారం స్థానిక కల్యాణ మండ‌పంలో ఘ‌నంగా ఏర్పాట్లు చేశారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ మొద‌లైంది.

సౌదీలో ఉన్న అజారుద్దీన్ గురువార‌మే భార‌త్ చేరుకోవాల్సి ఉంది. రూము నుంచి బ‌య‌లుదేరిన ఆయ‌న ట్రాఫిక్ జాం కార‌ణంగా విమానాశ్ర‌యానికి స‌కాలంలో చేరుకోలేక‌పోయాడు. దీంతో విమానం మిస్స‌యింది. ఈ విష‌యాన్ని తెలుసుకున్న వ‌ధూవ‌రుల కుటుంబ స‌భ్యులు నిరాశ చెంద‌కుండా వ‌రుడు లేకున్నా పెళ్లి జ‌రిపించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. వ‌రుడు అజారుద్దీన్ సోద‌రితో వ‌ధువు సోఫియా మెడ‌లో సూత్రధార‌ణ చేయించారు. అంతే పెళ్లి తంతు ముగిసింది. పెళ్లికి హాజ‌రైన వారంతా వ‌ధువును ఆశీర్వ‌దించి కానుక‌లు స‌మ‌ర్పించారు. ముస్లిం సంప్ర‌దాయం ప్ర‌కారం అంగీకార ప‌త్రాల‌పై వ‌ధూవ‌రులు సంత‌కాలు పెడితే స‌గం పెళ్లి అయిపోయిన‌ట్టేన‌ని కాబ‌ట్టి సోఫియాకు పెళ్లి జ‌రిగిన‌ట్టుగానే భావిస్తామ‌ని ముస్లిం పెద్ద‌లు పేర్కొన్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more