'పంజాబ్ ముఖ్యమంత్రి ఆయనే' అంటూ కుండబద్దలు కొట్టిన రాహుల్ గాంధీ

27-01-2017 Fri 16:00 | National
'తదుపరి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగే'నని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో ప్రముఖ క్రికెటర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ చేరిక అనంతరం ఆయనతో కాంగ్రెస్ లోపాయకారీ ఒప్పందం చేసుకుందని, భవిష్యత్ పంజాబ్ సీఎం సిద్ధూయేనంటూ అక్కడ వార్తలు వెల్లువెత్తాయి. దీనికి తోడు సిద్ధూ పార్టీలో చేరుతూనే బీజేపీ-అకాళీదల్ కూటమిపై నిప్పులు చెరిగారు. ఆప్ ను కూడా విమర్శించారు. దీంతో సిద్ధూ ఫాలోయింగ్ కాంగ్రెస్ కు తోడవుతుందని, పంజాబ్ లో సానుకూల ఫలితాలు వస్తాయంటూ విశ్లేషణలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థి అమరీందర్ సింగేనని, తాను బేషరతుగానే పార్టీలో చేరానని సిద్ధూ ప్రకటించారు. అయినప్పటికీ ఆ ఊహాగానాలు ఆగకపోవడంతో ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ తమ పార్టీ పంజాబ్ సీఎం అభ్యర్థి అమరీంద్ సింగేనని కుండబద్దలుకొట్టారు. సాధారణంగా బాదల్ (వర్షం) ని చూస్తే అంతా సంతోషిస్తారని, కానీ పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ మాత్రం పంజాబ్ కు నీళ్లివ్వడం లేదని ఆయన చమత్కరించారు. అలాగే గురునానక్ 'అంతా నీదేనని' అంటారని, పంజాబ్ సీఎం మాత్రం 'అంతా నాదే'నని అంటున్నారని ఆయన చమత్కరించారు.

 నాలుగేళ్ల క్రితం తాను పంజాబ్ వచ్చినప్పుడు పంజాబ్ లో 70 శాతం మంది యువత డ్రగ్స్ బానిసలుగా మారుతున్నారని ఆరోపించానని, అప్పుడు అంతా తన వ్యాఖ్యలను ఎద్దేవా చేశారని, ఇప్పుడు అంతా తాను చెప్పిందే చెబుతున్నారని తెలిపారు. పంజాబ్ లో ఎక్కడికి వెళ్లాలన్నా బాదల్ బస్సుల్లోనే వెళ్లాల్సి వస్తోందని మండిపడ్డారు. ప్రతి పరిశ్రమలోనూ, వ్యాపారంలోనూ ఒక్క కుటుంబ ఏకస్వామ్యం నడుస్తోందని విమర్శించారు.

తాము అధికారంలోకి వచ్చిన తరువాత పంజాబ్ లో డ్రగ్స్ పేరు చెబితే వణకాలని,  డ్రగ్స్ నిరోధానికి ప్రత్యేక చట్టం చేస్తామని అన్నారు. అలాగే పంజాబ్ ను ఎవరు గాయపరిచారో వారందర్నీ జైల్లో వేస్తామని ఆయన చెప్పారు. అవినీతిని అంతం చేస్తామని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ అకాలీదల్ తో ఎలా పొత్తు పెట్టుకుంటారని ఆయన ప్రశ్నించారు. కాగా, ఈ ఎన్నికల ప్రచారంలో అంతా సీఎం కుటుంబంపై అవినీతి ఆరోపణలను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నాయి. 

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more