రాస‌లీలల‌ గ‌వ‌ర్న‌ర్ ఔట్‌.. రాజీనామా చేసిన ష‌ణ్ముగ‌నాథ‌న్‌!

27-01-2017 Fri 06:43 | National
రాజ్‌భ‌వ‌న్‌ను రాసలీల‌కు కేంద్రంగా మార్చిన మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యాన్ని ఆయ‌న క్ల‌బ్‌గా మార్చేశార‌ని, అమ్మాయిలు నేరుగా గ‌వ‌ర్న‌ర్ ప‌డ‌క గ‌దికి వెళ్తున్నార‌ని పేర్కొంటూ రాజ్‌భ‌వ‌న్ సిబ్బంది ప్ర‌ధాని మోదీకి లేఖ రాయ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. ఓ మ‌హిళ కూడా ష‌ణ్ముగ‌‌నాథ‌న్‌పై ఆరోప‌ణ‌లు చేశారు. గ‌తేడాది రాజ్‌భ‌వ‌న్‌లోని పీఆర్వో పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్న త‌న‌తో గ‌వ‌ర్న‌ర్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌ని, కౌగ‌లించుకుని ముద్దులు పెట్టుకోబోయార‌ని ఆరోపించింది.

రాజ్‌భ‌వ‌న్‌ను అమ్మాయిల కార్య‌క‌లాపాల‌కు వేదిక‌గా మార్చ‌డంతోపాటు త‌మ‌ను మాన‌సిక ఒత్తిడికి, అవ‌మానాల‌కు గురిచేస్తున్న గ‌వ‌ర్న‌ర్‌ను త‌క్ష‌ణం ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ మొత్తం 98 మంది సిబ్బంది ఫిర్యాదుపై సంత‌కం చేసి ప్ర‌ధానికి పంపించారు. ఈ ఫిర్యాదును ప్ర‌ధానితోపాటు రాష్ట్ర‌ప‌తి, కేంద్రహోంమంత్రి, మేఘాల‌య ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాల‌కు కూడా పంపారు. తొలుత ఈ ఆరోప‌ణ‌ల‌ను ష‌ణ్ముగ‌నాథ‌న్ ఖండించారు. కొంద‌రు కావాల‌నే త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ కొట్టిప‌డేశారు. అయితే ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్త‌డం, ప‌ద‌వి నుంచి షణ్ముగ‌నాథ‌న్‌ను తొల‌గించాలంటూ సివిల్ సొసైటీ విమెన్ ఆర్గ‌నైజేష‌న్ సంత‌కాలు చేప‌ట్ట‌డంతో మ‌రోమార్గం లేక షణ్ముగ‌నాథ‌న్ త‌న ప‌దవికి రాజీనామా స‌మ‌ర్పించారు.  గ‌తంలో ఇవే ఆరోప‌ణ‌ల‌తో అప్ప‌టి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ ఎన్డీ తివారీ ప‌ద‌వి కోల్పోయిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more