విశాఖ‌లో టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌.. ఖాకీల ప‌హారా మ‌ధ్య స్టీల్ సిటీ!

26-01-2017 Thu 06:28 | Andhra
విశాఖ‌ప‌ట్నంలో ఇప్పుడు ఒక‌టే టెన్ష‌న్‌. ఈ రోజు ఏం జ‌ర‌గ‌బోతోంది? అనే ప్ర‌శ్న అంద‌రినీ వేధిస్తోంది. తీర న‌గ‌రాన్ని ఇప్ప‌టికే ఖాకీలు త‌మ అధీనంలోకి తీసుకున్నారు. ఓవైపు ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్న పెట్టుబ‌డిదారుల భాగ‌స్వామ్య‌ స‌ద‌స్సు.  మ‌రోవైపు  ప్ర‌జ‌ల భావోద్వేగంతో ముడిప‌డిన ప్ర‌త్యేక హోదా నిర‌స‌న‌. దీంతో స్టీల్ సిటీలో క‌నిపించ‌ని ఉద్రిక్త‌త నెల‌కొంది.  భాగ‌స్వామ్య స‌ద‌స్సులో పాల్గొనేందుకు వేలాదిమంది వ‌స్తున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదాను కోరుతూ నిర‌స‌న తెలిపేందుకు బీచ్ రోడ్డుకు ప్ర‌జ‌లు  పోటెత్త‌నున్నారు. ప్ర‌జ‌ల మౌన ప్ర‌ద‌ర్శ‌న‌కు రాజ‌కీయ పార్టీలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి దీనికి మ‌ద్ద‌తు తెలుపుతూ నిర‌స‌న‌లో పాల్గొన‌నున్నారు. దీంతో ఏ క్ష‌ణంలో ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెలకొంది.

పోలీసులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా రోడ్ల‌పై బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. మొత్తంగా గురువారం ఏపీకి ప్ర‌త్యేక హోదా కోరుతూ ప‌లు కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయి. వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్‌నాథ్ బీచ్‌లో నిర్వ‌హించ‌నున్న‌ కొవ్వొత్తుల ర్యాలీకి పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. మౌన ప్ర‌ద‌ర్శ‌నను విజ‌య‌వంతం చేయాల‌ని కోరుతూ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఇప్ప‌టికే ప‌లు కాలేజీల‌కు వెళ్లి విద్యార్థుల‌ను కోరారు. అలాగే  ‘ఆంధ్ర యువత’ ఆధ్వ‌ర్యంలో జిల్లా కోర్టుకు వెళ్లి న్యాయ‌వాదుల మ‌ద్దతు కోరారు. వీరికి సీపీఎం, సీపీఐ స‌హా ప‌లు విద్యార్థి సంఘాలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి.

మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్, వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విశాఖ వ‌స్తార‌న్న స‌మాచారంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి విశాఖ‌కు దారితీసే రోడ్ల‌పై విస్తృతంగా త‌నిఖీ చేస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకోవాలా? వ‌ద్దా? అనే విష‌యంలో పోలీసు అధికారులు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more