జైలులో కొట్టుకున్న రెండు గ్రూపులు... ఒక ఖైదీ మృతి

25-01-2017 Wed 15:55 | National
జైలులో రెండు గ్రూపుల మ‌ధ్య గొడ‌వ చెల‌రేగి ఒక‌రిపై ఒక‌రు దాడుల‌కు దిగ‌డంతో ఒక ఖైదీ మృతి చెందిన ఘ‌ట‌న గోవాలోని పంజీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సదా సబ్ జైలులో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మ‌రి కొంత‌మందికి గాయాలయ్యాయి. నిన్న‌ రాత్రి చోటు చేసుకున్న  ఈ ఘ‌ట‌న‌పై డీఎస్పీ లారెన్స్ డి సౌజా ఈ రోజు వివ‌రాలు తెలిపారు. మృతి చెందిన ఖైదీ పేరు వినాయక్ కోర్బాట్కర్ అని చెప్పారు. అయ‌న‌పై క‌త్తితో దాడి జ‌రిగిన అనంత‌రం వెంట‌నే ఆసుపత్రికి తరలించామ‌ని, అయితే ఆ ఖైదీ అప్ప‌టికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పార‌ని అన్నారు. ఈ నెలలోనే మరో ఖైదీ అశ్పక్ బెనర్జీపై కత్తితో దాడి జ‌రిగింద‌ని, ఆ ఘ‌ట‌న‌లో వినాయక్ ప్రమేయం ఉందని అన్నారు.

పంజీకి 15 కిలోమీటర్ల దూరంలో కొత్తగా నిర్మించిన కొల్వాలే సెంట్రల్ జైలులోకి ఈ ఖైదీలను తీసుకెళుతుండ‌గా ఖైదీల మ‌ధ్య ఈ గొడ‌వ చెల‌రేగింద‌ని చెప్పారు. ఈ స‌మ‌యంలో ఖైదీలు జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారని, ఈ క్ర‌మంలో జైలు సిబ్బందిపై కూడా ఖైదీలు దాడికి దిగార‌ని చెప్పారు. మెయిన్ గేట్ ద్వారా ఖైదీలు పారిపోతుండ‌గా అక్క‌డ ఉన్న పోలీసులు ఖైదీలను అడ్డుకున్నారని చెప్పారు. కొన్ని గంట‌ల త‌రువాత ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింద‌ని అన్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more